వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియా కింగ్‌కు ఎదురుదెబ్బ: ఫెయిల్ అయిన కీలక క్షిపణి

ఉత్తర కొరియా క్షిపణి ఒకటి పరిశీలిస్తుండగా పేలిపోయిందని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. తూర్పు తీరంలో సిన్పోలో హై ప్రొఫైల్ క్షిపణి పరీక్ష విఫలమైనట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

సియోల్: ఉత్తర కొరియా క్షిపణి ఒకటి పరిశీలిస్తుండగా పేలిపోయిందని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. తూర్పు తీరంలో సిన్పోలో హై ప్రొఫైల్ క్షిపణి పరీక్ష విఫలమైనట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

అమెరికాకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్న ఉత్తరకొ రియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కి ఇది ఘోరమైన అవమానంగా భావిస్తున్నారు.

missile

అమెరికాతో పోరులో వజ్రాయుధంగా భావిస్తున్న ఖండాతర బాలిస్టిక్ క్షిపణి పరిక్ష తుస్సుమందని అంటున్నారు. శుక్రవారం జరిగిన మిలిటరీ కవాతులో ఉత్తరకొరియా ఓ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శించింది.

ఉత్తర కొరియా అమ్ములపొదిలోని అస్త్రంగా ఈ క్షిపణిని పేర్కొన్నారు. మిలిటరీ కవాతు ముగిసిన కొన్ని గంటల తర్వాత అధ్యక్షుడు కిమ్ ఈ క్షిపణిని పరీక్షించారు.

కానీ ప్రయోగించిన వెంటనే క్షిపణి విఫలమైందని అమెరికా ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ అన్నారు. ఈ విషయం అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కి కూడా తెలుసునని, కానీ ఆయన స్పందించలేదని పెన్స్ తెలిపారు.

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగ పరీక్షను దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు కూడా ధృవీకరించారన్నారు. దీంతో ఉత్తర కొరియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని, కిమ్‌కు అవమాన పాలయ్యారని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

English summary
South Korean and US intelligence officials were trying to determine what type of missile was used. There has been no confirmation as yet of the launch attempt from North Korea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X