‘గన్’ సర్కార్‌ను సపోర్ట్ చేయం, భారత్, అమెరికా స్పష్టీకరణ..
ఆఫ్ఘనిస్థాన్‌లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని కీలక దేశాలు స్పష్టంచేశాయి. భారత్ సహా అమెరికా మరో 12 దేశాలు ఈ మేరకు తీర్మానం చేశాయి. ఐక్యరాజ్య సమితిలో ఆయా దేశాల ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు దాదాపు వశం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ దేశ ప్రభుత్వం శాంతి చర్చలు ప్రతిపాదించగా.. తాలిబన్లు తోసిపుచ్చారు. ఈ క్రమంలో మధ్యవర్తులు రంగంలోకి దిగారు.
యుద్ధ క్షేత్రంగా మారిన ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల నిరంతర దాడుల నేపథ్యంలో 12 దేశాలు నిర్ణయం తీసుకున్నాయని అమెరికా విదేశాంగశాఖ పేర్కొంది. ఆఫ్ఘన్‌లో శాంతి ప్రక్రియను వేగవంతం చేయాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియాకు చెప్పారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో నానాటికి దిగజారుతున్న పరిస్థితిపై ఖతార్ నిర్వహించిన రీజన్ కాన్ఫరెన్స్‌లో నార్వే, తజకిస్థాన్, టర్కీ, టుర్కెమిస్థాన్ పాల్గొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన పద్దతులపై చర్చించాయి.

మరోవైపు అధికారం పంచుకుందామని తాలిబన్లకు ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం రాయబారం పంపింది. మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. దీని ప్రకారం అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని పూర్తిగా సాగనంపేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికిప్పుడు హింసకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన చర్య అని, శాంతి చర్చల కమిటీ భావిస్తోంది. ఘనీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత తాలిబన్లు, ప్రస్తుత ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
Recommended Video
అందరితో చర్చించిన తర్వాతే ఈ ఫార్ములాను అమలు చేస్తారు. ఇప్పటి వరకూ అధికారికంగా దీనిని ఇటు తాలిబన్లతోగానీ, అటు ఆఫ్ఘన్ ప్రభుత్వంతోగానీ పంచుకోలేదు. మెల్లగా దేశంలోని మొత్తం భూభాగం తమ చేతుల్లో నుంచి జారి పోతుండటంతో అధికారం పంచుకుందామంటూ ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని తాలిబన్లు తిరస్కరించారు. ఈ క్రమంలో మధ్యవర్తుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది.












Click it and Unblock the Notifications