వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

90 శాతం సమర్థత చూపిన నొవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్: ఉత్పత్తి చేయనున్న సీరమ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం నొవావాక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90 శాతానికి మించి సమర్థత కలిగివుందని వెల్లడించింది.

అమెరికాతోపాటు మెక్సికోలో దేశాల్లో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ మెరుగైన రీతిలో ఫలితాలు సాధించింది. నొవావాక్స్ రూపొందించిన వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను అమెరికా, మెక్సికోలో 18ఏళ్లుపైబడిన 30వేల మంది వాలంటీర్లపై నిర్వహించారు. వీరికి మూడు వారాల గడువులో రెండు డోసులను ఇచ్చి పరీక్షించారు. తుది ప్రయోగశాల సమాచారాన్ని పూర్తి విశ్లేషించగా 90 శాతం సామర్థ్యాన్ని చూపినట్లు నొవావాక్స్ తెలిపింది.

 Novavax Covid Vaccine Shows 90% Efficacy: The vaccine to Be Made By Serum Institute

ఈ క్రమంలో సెప్టెంబర్ నాటికి అమెరికా, యూరప్ తోపాటు మరిన్ని దేశాల్లో వ్యాక్సిన్ వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. నెలకు 10 కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. తాజా సాంకేతికతతో స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేలా శరీరాన్ని సిద్ధం చేసే విధంగా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. ఇందుకోసం ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ప్రోటీన్ కాపీలను వినియోగించారు.

కాగా, ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనిపించే దుష్ప్రభావాలు కూడా స్వల్పంగానే ఉన్నట్లు నొవావాక్స్ సీఈవో స్టాన్లీ ఎకర్క్ తెలిపారు. ఇక బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్‌ను నొవావాక్స్ సమర్థంగా ఎదుర్కొందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ప్రపంచ దేశాలకు మొత్తం 110 కోట్ల డోసులను అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్టాన్లీ ఎర్క్ తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్ కార్యక్రమానికి 35 కోట్ల డోసులను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. కాగా, నొవావాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఇప్పటికే భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఒప్పందం చేసుకుంది. అనుమతులు రాగానే మనదేశంలోనూ భారీ ఎత్తున నొవావాక్స్ వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో వ్యాక్సిన్ల కొరత తీరే అవకాశం ఉంది.

English summary
Novavax Covid Vaccine Shows 90% Efficacy: The vaccine to Be Made By Serum Institute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X