ఐఎస్ఐఎస్ సొంత కరెన్సీ, సమాచారం లేదు: అమెరికా

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో అమెరికా దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ గాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వర్గాలు స్పందించాయి. అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు తమ వద్ద సమాచారం లేదని పేర్కొంది.

Now ISIS wants to introduce its own currency

ఐఎస్ఐఎస్ చీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరపలేదని, ఆ మిలిటెంట్ గ్రూపు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని అధికార ప్రతినిధి జెన్ సాకీ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఇరాక్ లోని మోసుల్ వద్ద 10 సాయుధ వాహనాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లోనే ఐఎస్ఐఎస్ చీఫ్‌ అబు బకర్ అల్ బాగ్దాదీ గాయపడినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లను చంపిన వారికి రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తామని లక్నోలోని ఆలిండియా షియా హుస్సేని ఫండ్ (ఏఐఎస్ హెచ్ఎఫ్) ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+