వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లజాతి నర్సు సాండ్రాకు తొలి టీకా -అమెరికాలో వ్యాక్సినేషన్ షురూ -ప్రపంచానికి ట్రంప్ కంగ్రాట్స్

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం మొదలైంది. న్యూయార్క్‌ కు చెందిన నల్లజాతీయురాలైన సాండ్రా లిండ్సే అమెరికాలో కొవిడ్ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్ విభాగంలో సాండ్రా లిండ్సే సోమవారం ఉదయం 9:30 గంటలకు ఫైజర్-బయోఎంటెక్ షాట్‌ను అందుకున్నారు.

co-win: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన -మీకూ టీకా కావాలంటే ఈ యాప్ ద్వారాco-win: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన -మీకూ టీకా కావాలంటే ఈ యాప్ ద్వారా

వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన ఘట్టాన్ని స్థానిక టెలిజన్లో ప్రత్యక్షప్రసారం చేశారు. "మొదటి వ్యాక్సిన్ డోసు పడింది. కంగ్రాట్స్‌ అమెరికా! కంగ్రాట్స్‌ వరల్డ్!" అని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషాన్ని పంచుకున్నారు. చాలారోజుల తర్వాత ట్రంప్ నుంచి వెలువడిన పాజిటివ్ ట్వీట్ ఇదే కావడం గమనార్హం.

 nurse Sandra Lindsay gets uss first Covid-19 vaccine, Congratulations WORLD trump tweets

''అమెరికాలో కరోనా తొలి వ్యాక్సిన్‌ను తీసుకోవడం గొప్పగా భావిస్తున్నాను. నాకు ఉపశమనం కలుగుతుంది'' అని నర్సు సాండ్రాలిండ్సే చెప్పారు. ఇది అమెరికా చరిత్రలో చాలా బాధాకరమైన సమయం ముగిసినట్లుగా సూచిస్తుందని నమ్ముతున్నానన్నారు. టీకా సురక్షితం అని ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరుతున్నట్లు చెప్పారు.

జగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనంజగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనం

వీడియో-లింక్ ద్వారా ల్యాండ్‌ మార్క్‌ మూవ్‌మెంట్‌ను వీక్షిస్తున్న న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో.. ఈ టీకా తనకు, ఇతర ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులకు భద్రత ఇస్తుందని ఆశిస్తున్నానని లిండ్సేతో చెప్పారు.

ప్రజలకు వ్యాక్సిన్‌ చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిర్ణీత దూరంతోపాటు మాస్కులను ధరించడం వంటి మార్గదర్శకాలను అనుసరించాలని అమెరికా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తున్నది. న్యూయార్క్ రాష్ట్రంలో 35,000 మందితోపాటు అమెరికా మొత్తం మీద 2,99,000 ఈ వైరస్ బారిన పడ్డారు.

English summary
A nurse in New York became the first person in the United States to receive the coronavirus vaccine Monday.Sandra Lindsay, a critical care nurse at the Long Island Jewish Medical Center, received the Pfizer-BioNTech shot live on television shortly before 9:30 am (1430 GMT). "First Vaccine Administered. Congratulations USA! Congratulations WORLD!" President Donald Trump tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X