యాహు పేరు మారింది, కొత్త పేరేమిటో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహు కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది.యాహును స్వంతం చేసుకొన్న వెరిజాన్ కంపెనీ తన ఏవోఎల్ మెయిల్ ను దానితో విలీనం చేసి ఓథ్ పేరిట కొత్త బ్రాండ్ ను తీసుకువచ్చిం
వాషింగ్టన్:ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహు కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది.యాహును స్వంతం చేసుకొన్న వెరిజాన్ కంపెనీ తన ఏవోఎల్ మెయిల్ ను దానితో విలీనం చేసి ఓథ్ పేరిట కొత్త బ్రాండ్ ను తీసుకువచ్చింది.
ఇక మీదట ఓథ్ మెయిల్, ఓథ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంటర్నెట్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.వెరిజాన్ కంపెనీ 4.8 బిలియన్ డార్ల మొత్తానికి యాహు కంపెనీని కొనుగోలుచేస్తోంది.

ఏవోఎల్ మెయిల్ లో యూహు విలీనమైన తర్వాత ఈ రెండింటిని కలిపి ఓథ్ అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకువస్తున్నట్టు ఏవోఎల్ సీఈవో టిమ్ ఆర్మ్ స్ట్రాంగ్ ట్విట్టర్ లో వెల్లడించారు.
వందకోట్లకుపైగా వినియోగదారులు, 20కి పైగా బ్రాండ్లు, ఎదురులేని బృందం టేక్ ద ఓథ్ అంటూ ఆర్మ్ స్ట్రాంగ్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications