మోస్ట్ పాపులర్: ఒబామా ట్వీట్‌కు 4.6మిలియన్ లైక్స్.., విపరీతంగా నచ్చేసింది..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఈ ఏడాది అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్‌గా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ట్వీట్ ఒకటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ట్వీట్‌కు ఏకంగా 4.6మిలియన్ల లైక్స్ రావడం విశేషం. ట్విట్టర్ తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ట్వీట్స్ జాబితాలో ఈ ట్వీట్ చోటు సంపాదించుకుంది.

ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. ఈ ఏడాది ఆగస్టులో వర్జీనియాలోని ఛార్లెట్స్‌విల్లేలో పెద్దఎత్తున జాతివిద్వేష అల్లర్లు చెలరేగాయి. అప్పట్లో దీనిపై స్పందించిన ఒబామా.. నెల్సన్ మండేలా సూక్తులను ప్రస్తావిస్తూ ఒక ఫోటో చేశారు. ఆ ట్వీట్ చాలామందికి నచ్చడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.

Obama's shared more than sitting US president

ఓ ఇంటి కిటికీ వద్ద చిన్నారులను పలకరిస్తున్న ఫోటోను పోస్టు చేసి.. 'శరీర ఛాయ, మతం, నేపథ్యం కారణంగా ఎవరూ మరొకరిని ద్వేషించరు' అన్న ట్వీట్‌ను ఒబామా దానికి జత చేశారు. 4.6మిలియన్ల లైక్‌లు వచ్చిన ఈ ట్వీట్.. ఎక్కువ మంది రీట్వీట్‌ చేసిన ట్వీట్ల జాబితాలోనూ రెండో స్థానంలో నిలిచింది.

కాగా, ట్విట్టర్ లో అత్యధిక మంది ఫాలో అవుతున్నవారిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ట్వీట్స్ ఒబామా ట్వీట్స్ అంత పాపులర్ కాకపోవడం గమనార్హం.

ఇక భారత్ విషయానికొస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోనే అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న నాయకుడిగా ఉన్నారు. దాదాపు 3.75కోట్ల మంది ఆయన ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former President Barack Obama beat his successor with three of the most shared tweets of 2017

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి