సముద్రం అడుగులో ఎయిర్ ఏషియా ప్లైన్?: కాకపోవచ్చు, నో టైమ్..
ఇండోనేషియా: గల్లంతైన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలినట్లుగా అనుమానిస్తున్న విషయం తెలిసిందే. జావా సముద్రంలో కొన్ని శకలాలు గుర్తించినట్లు ఇండోనేషియా అధికారి ఒకరు చెప్పారు. నంగ్కా దీవికి వంద కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొన్ని అనుమానిత శకలాలు ఆస్ట్రేలియా ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్ కనుగొందని సమాచారం ఇచ్చామని జకర్తాకు చెందిన ఎయిర్ ఫోర్స్ బేస్ కమాండర్ తెలిపారు.
అయితే, ఆ శకలాలు గల్లంతైన విమానానివా కాదా ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రస్తుతం సముద్రంలో గాలింపు కొనసాగుతుందని చెప్పారు. కాగా, ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రం అడుగు భాగంలో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న విమానం కూలిపోయి సముద్రం అడుగు భాగానికి చేరి ఉండవచ్చునని ఇండోనోషియా రెస్క్యూ ఏజెన్సీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదృశ్యమైన విమానాన్ని గుర్తించేందుకు సోనార్పరికరాలను ఇవ్వవలసిందిగా ఇండోనేషియా, మలేషియాలు అమెరికాను కోరాయి.
ఇండోనేషియా హెలికాప్టర్ జావా సముద్రంలో ఆయిల్ మరకలను గుర్తించింది. అయితే, అవి ఎయిర్ ఏషియా విమానానివి కాకపోవచ్చునని కూడా భావిస్తున్నారు. ఇండోనేషియా వైస్ ప్రెసిడెంట్ సోమవారం మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా విమానం కొన్ని శకలాలు గుర్తించిందని, వాటిని గుర్తించాల్సి ఉందని చెప్పారు. విమానం గల్లంతు పైన విచారణ జరుపుతున్నారు. సెర్చ్ ఆపరేషన్‌కు టైమ్ చెప్పలేమని అన్నారు. ఆయన వ్యాఖ్యల పైన ప్లైట్లోఉన్న వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications