అమెరికాలో అతివాద, మితవాదుల మధ్య ఘర్షణలు, ముగ్గురి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

వర్జీనియా: అమెరికాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. వర్జీనియా రాష్ట్రంలోని స్వతంత్ర నగరం చార్లెట్‌విల్‌లో అతివాద శ్వేత జాతీయులకు, మితవాదులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. దీంతో అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారు.

యూరోపియన్ వలసవాదుల నుండి అమెరికాను చేజిక్కించుకొందాం అంటూ అతివాదులు నినాదాలు చేయగా, అమెరికన్లంతా ఒక్కటేనని మితవాదులు ప్తరిగా నినాదాలు చేశారు.

శుక్ర, శనివారాల్లో చార్లెంట్‌విల్‌లోని పార్కులు, వీధుల్లో ఈ రెండు వర్గాల మధ్య అనుకూల, వ్యతిరేక వాదనాలు, నినాదాలు చోటుచేసుకొన్నాయి.

Ohio man charged with driving into Virginia marchers opposing white nationalists,

దక్షిణాది జాతీయవాదానికి గుర్తుగా ఉన్న కాన్పెడరేట్ పాస్ట్ స్మారక చిహ్నన్ని యూనివర్శిటీ వర్జీనియా నుండి తొలగించాలన్న స్థానిక కౌన్సిల్ నిర్ణయమే ఈ ఘర్షణలకు మూల కారణంగా బావిస్తున్నారు.

తాము గర్వకారణంగా భావించే ఈ స్మారక చిహ్నాన్ని తొలగించకూడదంటూ కరడుగట్టిన శ్వేత జాతీయులు కొందరు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది క్రమంగా యూరోపియన్ ఆఫ్రికన్ వలసదారులపై విద్వేషంగా మారింది.

మొదటి నుండి అమెరికాలో ఉంటున్న తమపై యూరప్ నుండి వచ్చిన వలసదారుల పెత్తనం చలాయిస్తున్నారని ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు.

నిరసనకారులకు నేతృత్వం వహించిన డేవిడ్ డ్యూక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్వేతజాతీయుల ఓట్లతోనే నీవు గెలిచావు. రాడికల్ లెఫ్టిస్టుల ఓట్లతో గెలవలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.

చార్లెట్‌విల్‌లో విద్వేష ప్రదర్శనలు, హింస చోటుచేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిని పాటించాలని ఆయన కోరారు.ఈ ప్రాంతంలో చోటుచేసుకొన్న ఘర్షణలను అదుపు చేయడంలో పోలిసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు కూడ లేకపోలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A car plowed into a crowd of people peacefully protesting a white nationalist rally Saturday in a Virginia college town, killing one person, hurting more than a dozen others and ratcheting up tension in a day full of violent confrontations.
Please Wait while comments are loading...