అమెరికాలో కాల్పుల బీభత్సం... ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి...
అమెరికాలోని ఓక్లాహామా రాష్ట్రంలో దారుణం జరిగింది. మస్కోజీ నగరంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడు ఐదుగురు పిల్లలు సహా మొత్తం ఆరుగురిని కాల్చి చంపాడు. మరో మహిళకు తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే ఆ అగంతకుడు ఎవరు... ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్నది ఇంకా తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30గంటల సమయంలో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఓ వ్యక్తి చేతిలో గన్‌తో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే ఫైరింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అనంతరం అతన్ని జైలుకు తరలించారు.

Recommended Video
ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే నలుగురు చిన్నారులతో పాటు ఒక వ్యక్తి కాల్పుల్లో చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు. మరో చిన్నారి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయినప్పటికీ లాభం లేకపోయిందని... పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారని మృతి చెందిందని చెప్పారు. గాయపడ్డ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని... మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పారు.
-
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications