వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్ట్ 90: 15 వేల ఎత్తు నుండి స్కైడైవ్ చేసిన బామ్మ

|
Google Oneindia TeluguNews

లండన్: మహిళలు అనుకుంటే సాహసాలు చెయ్యడానికి వెనకడుగు వెయ్యరు. వారు తెగిస్తే ప్రాణాలను సైతం లెక్క చెయ్యరు. ఇంట్లో కూర్చుని పిల్లలతో కాలక్షేపం చెయ్యవలసిన 90 సంవత్సరాల బామ్మ స్కైడైవ్ చేసి అందరికి చుక్కులు చూపించారు.

ఇంగ్లాండ్ కు చెందిన స్టెల్లా గిలార్డ్ (90) అనే బామ్మ 15,000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవ్ చేశారు. అయితే ఆమె గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఈ సాహసం చెయ్యలేదు. సమాజం కోసం ఆమె ప్రాణాలకు తెగించారు. స్టెల్లా చేసిన సాహసానికి రూ. 1.54 లక్షల నిధులు వచ్చాయి.

Old Woman Skydives in London

ఆ నిధులను కేన్సర్ పరిశోధన సంస్థకు అందించి మానవత్వం చాటుకున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం స్టెల్లా కుమార్తె కేన్సర్ వ్యాధితో మరణించారు. కుమార్తె మరణించిన తరువాత స్టెల్లా కుంగిపోయారు. తన కుమార్తె జ్ఞాపకార్థం ఆ నిధులు కేన్సర్ పరిశోదన సంస్థకు అందిచానని స్టెల్లా అంటున్నారు.

ఇన్ స్టక్టర్ చెప్పినట్లు తాను స్కై డైవ్ చేశానని స్టెల్లా అంటున్నారు. 15 వేల అడుగుల పై నుండి స్కై డైవ్ చేస్తున్న సమయంలో తనకు ఎలాంటి భయం కాలేదని, అయితే ప్యారాచూట్ తెరుచుకొకపోవడంతో కొంచెం భయపడ్డానని, తరువాత చాలా అనుభూతికి లోనైనానని స్టెల్లా అంటున్నారు.

English summary
Stella Gillard (90) in the UK has proved that age is no bar after she skydived from a height of 15,000 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X