వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron వేరియంట్ వ్యాప్తి వేగం ఊహించని విధంగా: డబ్ల్యూహెచ్ఓ డీజీ ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక విషయాలను వెల్లడించింది. గతంలో వచ్చిన ఏ కరోనా వేరియంట్ కూడా ఒమిక్రాన్ తో పోల్చలేమని పేర్కొంది.

ఒమిక్రాన్.. ప్రపంచాన్ని చుట్టేసిందన్న డబ్ల్యూహెచ్ఓ

ఒమిక్రాన్.. ప్రపంచాన్ని చుట్టేసిందన్న డబ్ల్యూహెచ్ఓ

గతంలో వచ్చిన కరోనా వేరియంట్ల వ్యాప్తి వేగం కంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... "77 దేశాలు ఇప్పుడు ఓమిక్రాన్ కేసులను నివేదించాయి. వాస్తవమేమిటంటే, ఓమిక్రాన్ ఇంకా కనుగొనబడనప్పటికీ, చాలా దేశాలలో ఉండవచ్చు' అని అన్నారు. ఒమిక్రాన్.. తాము మునుపటి వేరియంట్‌తో చూడని స్థాయిలో వ్యాప్తి చెందుతోందని తెలిపారు.

బ్రిటన్‌లో ఒమిక్రాన్ తొలి మరణం, ఆంక్షలు

బ్రిటన్‌లో ఒమిక్రాన్ తొలి మరణం, ఆంక్షలు

దక్షిణాఫ్రికాలో మొదటగా వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందిందని, బ్రిటన్ దేశంలోనూ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా, సోమవారం ఒమిక్రాన్ వేరియంట్ తొలి మరణాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూడటంతో ఆ దేశ ప్రయాణాలపై అనేక దేశాలు నిషేధాలు విధించాయి. విదేశీ ప్రయాణాలపైనా ఆంక్షలు విధిస్తున్నాయి.కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ను కట్టడి చేసేందుకు పలు దేశాలు బూస్టర్ డోసుపై దృష్టి సారించాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.

బూస్టర్ డోసుతో మేలే, వ్యతిరేకం కాదన్న డబ్ల్యూహెచ్ఓ

బూస్టర్ డోసుతో మేలే, వ్యతిరేకం కాదన్న డబ్ల్యూహెచ్ఓ

అయితే, బూస్టర్ డోసు కూడా ఆ వేరియంట్ పై పనిచేస్తుందా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థమేనని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కట్టడి కోసం జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అండగా ఉంటోందని ఆయన తెలిపారు. ఇతర వ్యాధులతోపాటు ఒమిక్రాన్ బారినపడినవారికి బూస్టర్ డోసు మేలు చేసే అవకాశం ఉందని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసు ఒమిక్రాన్ మరణాలను తగ్గించే అవకాశం కూడా లేకపోలేదని టెడ్రోస్ తెలిపారు. అందుకే, బూస్టర్ డోసుకు డబ్ల్యూహెచ్ఓ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ప్రజలందరినీ కాపాడటమే తమ లక్ష్యమని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ డిసెంబర్ నెలలోగా తమ దేశంలోని వయోజనులందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆస్ట్రేలియా బూస్టర్ వ్యవధి కాలాన్ని తగ్గించింది. కాగా, ఇంతకుముందు వచ్చిన కరోనా వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉందని, తమ దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాలు సంభవించలేదని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం.

English summary
Omicron Spreading At A Rate Not Seen With Any Other Covid Variant: WHO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X