• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: కరోనాతో బలవంతపు కాపురమే - దశాబ్దాలపాటు వైరస్ ప్రభావం - WHO సంచలన ప్రకటన..

|

పరస్పర అంగీకారంతో ఇష్టపూర్తిగా చేసేది సహజీవనం. కానీ ఏకపక్షంగా ఒక్కరికే నచ్చనట్లు సాగేది బలవంతపు కాపురం. అందుచేత, కరోనా మహమ్మారి విషయంలో రాజకీయ నేతలు తరచూ చెబుతోన్న మాటను ఇక సవరించుకోవాలేమో. పిలవని అతిథిగా ప్రవేశించి, భూగోళాన్ని చాపచుట్టేసిన భయానక వైరస్.. ఇప్పుడప్పుడే రూపుమాసిపోదని, దాని ప్రభావం దశాబ్దాలపాటు కొనసాగుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంచలన ప్రకటన చేసింది. తద్వారా రాబోయే తరాలకు కూడా కరోనాతో సోకాల్డ్ సహజీవనం తప్పదనే సంకేతాలిచ్చింది.

  COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu

  కరోనా కేసుల్లో మళ్లీ రికార్డు: కొత్తగా 54వేలు - ట్యాలీ 18లక్షలు, డెత్ టోల్ 37వేలపైనే..

  ఆరు నెలలు ముగియడంతో..

  ఆరు నెలలు ముగియడంతో..

  ప్రపంచానికి శనిలా దాపురించిన కరోనా వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీ విభాగం మరోసారి సమావేశమైంది. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులతో కూడిన ఈ ఎమర్జెన్సీ కమిటీనే కరోనాను పాండమిక్(మహమ్మారి)గా ప్రకటించింది. గడిచిన 6 నెలల్లో కరోనా పరిస్థితిని విశ్లేషించిన కమిటీ.. ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరికలను జారీ చేసింది.

   100ఏళ్ల కు ఓసారి ఇలా..

  100ఏళ్ల కు ఓసారి ఇలా..

  కరోనా వైరస్ లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయని, వాటి ప్రభావం ప్రపంచంపై దశాబ్దాలపాటు కొనసాగుతుందని డబ్ల్యూ హెచ్ వో డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అథానోమ్ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తీరు మార్చుకుంటోన్న కరోనా విషయంలో శ్వాస సంబంధిత అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని, మరికొన్ని కీలక సమస్యలకు సమాధానాలు లభించాల్సి ఉందని అథానోమ్ పేర్కొన్నారు.

  రాజధానిపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - తరలింపునకు ముందే 4 జోన్ల ఏర్పాటు - చైర్మన్లు ఎవరంటే..

  ఇప్పుడే ఊపిరి పీల్చుకోవద్దు..

  ఇప్పుడే ఊపిరి పీల్చుకోవద్దు..

  ‘‘చైనా వెలుపల 100 కసులు నమోదైన సందర్భంలోనే డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీని ప్రకటించింది. అప్పటికి చైనాలో తప్ప ఏ దేశంలోనూ మరణాలు నమోదు కాలేదు. పలు దేశాలు కట్టడి చర్యల్లో విఫలమైన కారణంగానే వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్ ముప్పు ఇంతటితో తొలిగిపోలేదు. చాలా దేశాల్లో రెండో దశ వజృంభణ మొదలైంది. ఇంకొద్ది రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుందని ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేనేలేదు. మొదటి దశలో తక్కువ తీవ్రత ఉన్న దేశాల్లో.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. మాస్కులు ధరించడం, శానిటైజన్ల వాడకం, ఫిజికల్ డిస్టెన్స్ నియమాలు, పబ్లిక్ గ్యాదరింగ్స్ నివారణ లాంటి చర్యలతో మాత్రమే కరోనా ను అదుపులో ఉంచగలం'' అని ప్రపచం ఆరోగ్య సంస్థ జనరల్ సెక్రటరీ తెలిపారు.

  కరోనాకు 7లక్షల మంది బలి..

  కరోనాకు 7లక్షల మంది బలి..

  చైనా వెలుపల తొలి కరోనా పాజిటివ్ కేసు జనవరి 31న నమోదుకాగా, జులై 31 నాటికి.. అంటే ఆరు నెలల పాటు ప్రతి రోజూ యావరేజ్ గా 50వేల మంది ఇన్ఫెక్షన్ కు గురవుతూ వచ్చారు. ఆదివారం(ఆగస్టు 2) నాటికి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1.8కోట్లకు పెరిగింది. అందులో గణనీయంగా 1.13కోట్ల మంది వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ, దాదాపు 7లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

  English summary
  The World Health Organization has warned that the coronavirus pandemic is likely to be lengthy. ‘Coronavirus a once-in-a-century health crisis, effects to last decades’ members says. The statement comes after an emergency committee of WHO met to evaluate the crisis six months after sounding the international alarm.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more