బంగ్లాదేశ్ విముక్తి కోసం నేనూ పోరాడా-నా తొలి పోరాటాల్లో ఆదీ ఒకటి- ప్రధాని మోడీ
బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం లభించి అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఢాకా చేరుకున్న ప్రధాని మోడీకి బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం హసీనాతో కలిసి మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
1971లో తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న బంగ్లాదేశ్‌కు భారత్ విముక్తి కల్పించింది. ఈ పోరాటంలో తాను కూడా పాల్గొన్నట్లు ప్రధాని మోడీ ఇవాళ వెల్లడించారు. అంతే కాదు తన తొలి పోరాటాల్లో అది కూడా ఒకటన్నారు. అప్పటి పోరాటానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లా విముక్తి పోరాటం జరిగినప్పుడు తాను 20 ఏళ్ల కుర్రాడిగా ఉన్నానని, భారత్‌లో బంగ్లా విముక్తి పోరుకు మద్దతుగా స్నేహితులతో కలిసి సత్యాగ్రహం చేసినట్లు మోడీ తెలిపారు. అప్పుడు సత్యాగ్రహం చేసినందుకు జైలుకు కూడా వెళ్లానన్నారు.

బంగ్లా విముక్తి కోసం అప్పట్లో సైనికులు చేసిన త్యాగాలను తామెప్పటికీ మర్చిపోలేమని మోడీ తెలిపారు. అప్పట్లో బంగ్లా సైనికులు చేసిన త్యాగాల్ని భారత్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని మోడీ పేర్కొన్నారు. తద్వారా భారత్ అప్పటికీ, ఇప్పటికీ బంగ్లాదేశ్‌కు అండగా ఉంటుందని వారి గడ్డలోనే ప్రధాని మోడీ ప్రకటించారు. బంగ్లా స్వాతంత్ర పోరాటం సందర్భంగా అసువులు బాసిన సైనికులతో పాటు బంగ్లా పిత, ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు కూడా మోడీ నివాళులు అర్పించారు.













Click it and Unblock the Notifications