• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదానికి గేట్ వే: తబ్లిగీ జమాత్‌పై నిషేధం: ముస్లిం దేశం సంచలన నిర్ణయం: భారత్‌లో ఎప్పుడు?

|
Google Oneindia TeluguNews

రియాధ్: తబ్లిగి జమాత్.. ఈ పేరు తెలియని వారు భారత్‌లో బహుశా ఉండకపోవచ్చు. గత సంవత్సరం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి తబ్లిగి జమాత్‌ నిర్వహించిన మత సమావేశాలే ప్రధాన కారణం అంటూ అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్‌లో మూడురోజుల పాటు చేపట్టిన అంతర్జాతీయ స్థాయి మత సమావేశం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి హాట్ స్పాట్‌గా మారిందంటూ వార్తలు వచ్చాయి.

తబ్లిగి జమాత్‌పై నిషేధం..

తబ్లిగి జమాత్‌పై నిషేధం..

ఇప్పుడు మళ్లీ తాజాగా వార్తల్లోకి ఎక్కింది మత ప్రచార సంస్థ తబ్లిగి జమాత్. సౌదీ అరేబియా తబ్లిగి జమాత్‌ను నిషేధించింది. ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాలపై పూర్తి స్థాయి నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సంస్థతో అసోసియేట్ అయివున్న వ్యక్తులకు హెచ్చరికలను జారీ చేసింది. ఏ వ్యక్తి గానీ, సంస్థ గానీ..చివరికి మసీదులు గానీ తబ్లిగి జమాత్‌కు అనుబంధంగా కొనసాగకూడదని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని స్పష్టం చేసింది.

 ఉగ్రవాదులకు గేట్ వేగా..

ఉగ్రవాదులకు గేట్ వేగా..

తబ్లిగి జమాత్‌ను ఉగ్రవాదానికి ప్రధాన ద్వారంగా అభివర్ణించింది సౌదీ అరేబియా. ఈ సంస్థ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు అనుమానిస్తున్నామని, అందుకే దీన్ని నిషేధించినట్లు సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ అబ్దుల్ అల్ షేక్ ప్రకటించారు. తబ్లిగి జమాత్‌తో పాటు దవా గ్రూప్‌ను కూడా నిషేధించినట్లు చెప్పారు. ఈ రెండు సంస్థలతో ఎలాంటి లావాదేవీలను తమ దేశ పౌరులు నిర్వహించకూడదని సూచించారు.

ముప్పు గురించి మసీదుల్లో..

ముప్పు గురించి మసీదుల్లో..

ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా తబ్లిగీ జమాత్ కార్యకలాపాలను ఉన్నాయని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. తబ్లిగీ జమాత్​తో సమాజానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాల్సిన బాధ్యత ముస్లిం మత పెద్దలు, మౌల్వీలు, మసీదులపై ఉందని స్పష్టం చేశారు. తబ్లిగీ జమాత్ కార్యకలాపాలు సమాజానికి చేటు కలిగించేలా ఉన్నాయని అన్నారు.

35 కోట్ల మంది జమాతీలు..

35 కోట్ల మంది జమాతీలు..

1926లో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తబ్లిగీ జమాత్ ప్రతినిధులు ఉన్నారు. వారి సంఖ్య సుమారు 35 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. సున్నీ ఇస్లామిక్ విధానాన్ని అనుసరించే మత సంస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో తబ్లిగీ జమాత్ శాఖలు ఉన్నాయి. అందులో సౌదీ అరేబియా, భారత్ కూడా ఉన్నాయి. తాజాగా సౌదీ అరేబియా.. ఈ సంస్థను నిషేధించినట్లు ప్రకటించింది. ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ సంస్థకు దూరంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది.

భారత్ సహా అనేక దేశాలకు విస్తరణ..

భారత్ సహా అనేక దేశాలకు విస్తరణ..

భారత్ సహా ఇండోనేసియా, మలేసియా, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, థాయిలాండ్​ వంటి అనేక దేశాల్లో తబ్లిగీలు ఉన్నారు. వారి సంఖ్య కనీసం 35కోట్లకు పైమాటే. తబ్లిగీ జమాత్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయంటూ ఇదివరకు చాలాసార్లు ప్రచారం సాగింది. అప్పడు వీటిని పెద్దగా ఖాతరు చేయలేదు. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతోనూ సత్సంబంధాలను కలిగి ఉన్నట్లు వికీ లీక్స్ కొన్ని డాక్యుమెంట్లతో సహా నిరూపించింది. ఉగ్రవాదులకు డబ్బు,వీసాలు తబ్లిగీ ద్వారా అందుతున్నాయని పేర్కొంది.

English summary
Saudi Arabia bans Tablighi Jamaat, calling it one of the gates of terrorism and warns people against associating with the organisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X