రైల్వే స్టేషన్లో దుండగుడి కాల్పులు: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
జార్జియా రాజధాని అట్లాంటాలో కాల్పులు కలకలం సృష్టించాయి. అట్లాంటాలోని వెస్ట్ లేక్ రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చ
అట్లాంటా: జార్జియా రాజధాని అట్లాంటాలో కాల్పులు కలకలం సృష్టించాయి. అట్లాంటాలోని వెస్ట్ లేక్ రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అప్రమత్తమైన భద్రతా బలగాలు నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. దాడికి ఎందుకు పాల్పడ్డాడనేది పోలీసులు విచారణలో తేలే అవకాశం ఉంది.

కాల్పుల నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సుమారు 30ఏళ్లున్న వ్యక్తి ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.












Click it and Unblock the Notifications