ముప్పేట దాడిలో ఇజ్రాయెల్- భీకర పోరు

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 1,600 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది.

Operation iron sword: Rocket attack from Lebanon targeted an Israeli radar station

గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తమ దేశంలో ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున విధ్వంసానకి పాల్పడుతోందంటూ హమాస్ ఉగ్రవాదులు ఆరోపిస్తోన్నారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించారు.

దాడులు- ప్రతిదాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా స్ట్రిప్, పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో అట్టుడికిపోతున్నాయి. రాకెట్ల ప్రయోగాలు, వైమానిక దాడులతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాము యుద్ధం చేస్తోన్నామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ప్రకటించారంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీనికి అనుగుణంగా పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. పాలస్తీనా చుట్టూ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేసింది. లెబనాన్, సిరియా సరిహద్దులనూ కట్టుదిట్టం చేసింది. యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. కౌంటర్ రాకెట్లను అందుబాటులో ఉంచింది.

అదే సమయంలో లెబనాన్ సైతం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లెబనాన్ దక్షిణ ప్రాంతం నుంచి రాకెట్లు విరుచుకుపడుతున్నాయి. ఈ దాడిలో ఇజ్రాయెల్ రాడార్ స్టేషన్ ధ్వంసమైంది. ఇలాంటి దాడి ఉండొచ్చని ఊహించడం వల్లే ఇజ్రాయెల్ సైన్యం ముందు జాగ్రత్తచర్యగా లెబనాన్ సరిహద్దుల్లో ఆయుధాలను తరలించింది. ఇప్పుడు ఎదురుదాడికి దిగింది.

లెబనాన్ కేంద్రంగా చేసుకుని విస్తృతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోన్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్స్ దళాలు.. ఈ దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ అంచనా వేసింది. హమాస్ ఉగ్రవాదులతో హెజ్బొల్లా మిలిటెంట్లు చేతులు కలిపారని భావిస్తోంది. లెబనాన్ నుంచి ఆరంభమైన దాడిని సమర్థవంతంగా తిప్పి కొడతామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+