వెనీజులాపై దాడి వేళ.. పనామా అధ్యక్షుడూ అమెరికా కస్టడీలోకి.. ఈ స్టోరీ తెలుసా..?

వెనీజులాపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ రాజధాని కరాకస్​ పరిసర ప్రాంతాల్లోని ఏడు చోట్ల భారీ పేలుళ్లు జరిపింది. తరువాత వెనుజువెలా దేశాధ్యక్షుడిని, అతని భార్యను కస్టడీలోకి తీసుకుంది. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టింది. అమెరికా దాడులతో వెనీజులా అట్టుడికిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా అస్తవ్యస్తం అయింది. భయాందోళనతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నికోలస్ మదురో అమెరికాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్నారని ట్రంప్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే వెనీజులాపై అమెరికా దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఇక 1989 తర్వాత ఒక లాటిన్ అమెరికా దేశ వ్యవహారాల్లో యూఎస్​ నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. 1989 లో పనామాలోనూ ఇలాంటి విధ్వంసమే సృష్టించింది అమెరికా. 1989 డిసెంబర్‌ లో 'ఆపరేషన్ జస్ట్ కాజ్' పేరుతో అమెరికా పనామాను ఆక్రమించింది. ఆ దేశ అధ్యక్షుడు, నియంత అయిన మాన్యువల్ నోరియెగాను బంధించి అమెరికాకు తీసుకెళ్లింది. నోరియెగాపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ ఆరోపణలు US కోర్టులలో ఆయనపై అప్పటికే అభియోగాలు ఉన్నాయి.

పనామా సిటీలోని వాటికన్ దౌత్య కార్యాలయంలో 10 రోజులపాటు ఆశ్రయం పొందిన తర్వాత, నోరియెగా 1990 జనవరి 3న అమెరికా దళాలకు లొంగిపోయారు. మరుసటి రోజు ఆయనను మయామికి విమానంలో తరలించారు. ఆ తర్వాత నోరియెగాకు 1992లో 40 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అమెరికాలో శిక్ష అనుభవించాక, ఆయనను ఫ్రాన్స్‌ కు, ఆ తర్వాత పనామాకు అప్పగించారు. 2017లో అక్కడే ఆయన మరణించారు.

Operation Just Cause How the U S Invaded Panama in 1989 to Capture Dictator Manuel Noriega

ఇక వెనీజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, సతీమణి సిలియా ఫ్లోర్స్​ తమ కస్టడిలోకి తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వారిద్దరినీ ప్రస్తుతం వెనీజులా వెలుపలకు తరలించినట్లు పేర్కొన్నారు. అలాగే ఉదయం 11 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+