'ఆపరేషన్ సింధూర్' సమయంలో సీజ్ ఫైర్ కు పాకిస్థాన్ ఒత్తిడి.. కారణం ఇదే

2025 మే 7 నుండి 10 వరకు, మొత్తం 88 గంటల పాటు పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ సాగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాల వైమానిక ఆధిపత్యం పాకిస్థాన్ ను కాల్పుల విరమణకు ఒత్తిడి చేసిందని ఒక యూరోపియన్ సైనిక విశ్లేషణ స్పష్టం చేసింది. ఈ నివేదికను స్విట్జర్లాండ్‌ లోని పుల్లీకి చెందిన సెంటర్ డి హిస్టోయిర్ ఎట్ డి ప్రోస్పెక్టివ్ మిలిటైర్స్ అనే థింక్ ట్యాంక్ సంస్థ ప్రచురించింది. 'ఆపరేషన్ సిందూర్: ది ఇండియా- పాకిస్థాన్ ఎయిర్ వార్' అనే శీర్షికతో ఉన్న ఈ నివేదికను రిటైర్డ్ స్విస్ వైమానిక దళ మేజర్ జనరల్ అడ్రియన్ ఫోంటానెల్లాజ్ రాశారు.

నివేదికలోని విశ్లేషణ బట్టి.. కేవలం నాలుగు రోజులు మాత్రమే జరిగిన ఈ సైనిక ఘర్షణలో భారత సైన్యం ఉద్రిక్తత స్థాయి, వేగం రెండింటినీ సంపూర్ణంగా నియంత్రించగలిగింది. భారత్ తమ ముఖ్యమైన ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకుంది. పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుండా.. అణు పరిమితులను ఏ మాత్రం ఉల్లంఘించకుండానే, తమ లోతైన దాడుల సామర్థ్యాన్ని విశ్వసనీయంగా నిరూపించుకోవడం ద్వారా స్పష్టమైన కార్యాచరణ ప్రయోజనాన్ని సాధించింది.

ఈ సైనిక వివరాలను "ఆపరేషన్ సిందూర్: ది ఇండియా-పాకిస్తాన్ ఎయిర్ వార్ (మే 7-10, 2025)" పేరుతో సైనిక విశ్లేషకుడు అడ్రియన్ ఫోంటానెల్లజ్ వెల్లడించారు. ఈ నివేదికను గత వారం, స్విట్జర్లాండ్‌లోని పుల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ డి'హిస్టోయిర్ ఎట్ డి ప్రోస్పెక్టివ్ మిలిటెయిర్స్ (CHPM) అనే స్వతంత్ర స్విస్ సైనిక చరిత్ర మరియు వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ ప్రచురించింది.

1969లో స్థాపించిన CHPM, సైనిక పరిశోధనలో వృత్తిపరమైన ప్రమాణాలు, ఘర్షణల నుండి నేర్చుకున్న పాఠాలను విశ్లేషించడానికి ఒక తటస్థ వేదికగా పనిచేస్తుంది. పారిస్ కేంద్రంగా పనిచేసే వ్యూహాత్మక విశ్లేషకుడు జోసెఫ్ హెన్రోటిన్, స్విస్ వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్, మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ క్లాడ్ మేయర్, అలాగే అణు సిద్ధాంతం, ఆయుధ నియంత్రణలో నిపుణుడైన ఆర్థర్ లూసెంటితో కూడిన నిపుణుల కమిటీ ఈ ప్రచురణను సంస్థాగతంగా సమీక్షించింది.

మే 7 నుండి 10 వరకు భారత్ తన గగనతల రక్షణ ఆస్తులను రక్షించుకోవడమే కాకుండా, పాకిస్తాన్‌పై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని నివేదిక పేర్కొంది. అలాగే అణు పరిమితులను అతిక్రమించకుండానే పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడి చేసే తన సామర్థ్యాన్ని భారత్ నిరూపించుకుందని ఇందులో వివరించారు.

ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.

OperationSindoor Air War European Study Says India s Sky Control Pressured Pakistan to Back Down

పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+