పరువు కోసం రెండో భార్యను హత్య చేసిన మాజీ భర్త
లాహోర్: బ్రిటీష్ సంతతికి చెందిన పాకిస్తాన్ మహిళను దారుణంగా హత్య చేసిన కేసు మిస్టరీ వీడిందని స్థానిక పోలీసులు చెప్పారు. వేరే తెగకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఆమె మాజీ భర్త హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
సామియా షాహిద్ (28) అనే మహిళ జులై 20వ తేది హత్యకు గురైయ్యింది. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని బెలుం జిల్లాలో తల్లిదండ్రుల ఇంట్లో సానియా షాహిద్ హత్యకు గురైయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

సానియా మాజీ భర్త చౌధురీ షకీల్ ను విచారణ చేశారు. తనకు విడాకులు ఇచ్చిన సానియా షాహీద్ షియా తెగకు చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుందని, అందుకే ఆమె మీద కక్ష పెంచుకున్నానని చౌధురీ షకీల్ పోలీసులకు చెప్పాడు.
సామియా షాహిద్ తల్లిదండ్రుల ప్రమేయంతోనే తాను తన మాజీ భార్యను హత్య చేశానని చౌధురీ షకీల్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. తనతోపాటు సామియా షాహీద్ తల్లిదండ్రులను విచారణ చెయ్యాలని చౌధురీ షకీల్ చెబుతున్నాడని, సామియా తండ్రి రోజుకు ఓ మాట చెప్పి విచారణ పక్కదోవ పట్టిస్తున్నాడని, ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications