అవినీతితో పదవికి రిజైన్, ప్యాలెస్: ప్యాలెస్‌లో కుక్కల్ని వదిలి వెళ్లింది

Posted By:
Subscribe to Oneindia Telugu

సియోల్: సౌత్ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌హై కుంభకోణంలో ఇరుక్కొని పదవికి రాజీనామా చేశారు. అనంతరం అధికారిక నివాసమైన బ్లూ హౌస్‌ ప్యాలెస్‌ను ఖాళీ చేశారు. కానీ ఆమె పెంచుకుంటున్న తొమ్మిది శునకాలను అక్కడే వదిలేశారు.

ఈ విషయం జంతురక్షణ సంఘానికి తెలియడంతో ఆమె అలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయంగా మారింది.

Outrage after ousted South Korea leader leaves dogs at presidential palace

అధ్యక్షురాలిగా పార్క్‌ 2013లో ప్యాలెస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె పక్కింటి వారు జిండో జాతి కుక్కలను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు వాటితో పాటు మరో ఏడు కుక్కపిల్లలు తోడయ్యాయి.

దాంతో వాటిని తీసుకెళ్లలేక ఆమె అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు బ్లూహౌస్‌ ప్రతినిధి కిమ్‌ డాంగ్‌జో చెప్పారు. ఆమె కుక్కలను వదిలి వెళ్లారని తెలియగానే నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆమెకు మనుషులపై, జంతువులపై ఎలాంటి జాలి లేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Outrage after ousted South Korea leader leaves dogs at presidential palace
Please Wait while comments are loading...