ఇండోనేసియాలో భారీ వాల్కనో సునామీ, 222 మంది మృతి: భారీ ఆస్తి, ప్రాణ నష్టం
జకర్తా: ఇండోనేసియాలో సునామీ భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. శనివారం రాత్రి ఇండోనేసియాను సునామీ ముంచెత్తింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సంభవించిన సునామీ ధాటికి 222 మంది మృతి చెందారు.
దాదాపు 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇండోనేసియా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇద్దరు తప్పిపోయినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో బిల్డింగులు దెబ్బతిన్నాయి. నష్టం ఎంత అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో సునామీ వచ్చిందని తెలిపారు. అగ్నిపర్వతం బద్దలవడంతో వాల్కనో సునామీ సంభవించింది. ఈ వాల్కనో సునామీ కారణంగా తొమ్మిది పది హోటల్స్, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు సంభవించిన తర్వాత సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడి అలజడి చోటుచేసుకోవడమే ఈ సునామీకి కారణమై ఉంటుందని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications