వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 ఏళ్ల క్రితం, పాఠాలు సరిగా చెప్పలేదు: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీపై రూ.8 కోట్ల దావా

తనకు పాఠాలు సరిగా చెప్పలేదని, తనకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ రాలేదని చెబుతూ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంపై ఓ పూర్వ విద్యార్థి దావా వేశారు. దావా వేసిన ఫయీజ్ సిద్ధిఖీ పూర్వ విద్యార్థి. తనకు సరైన విద్య బోధించకపో

|
Google Oneindia TeluguNews

ఆక్స్‌ఫర్డ్: తనకు పాఠాలు సరిగా చెప్పలేదని, తనకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ రాలేదని చెబుతూ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంపై ఓ పూర్వ విద్యార్థి దావా వేశారు. దావా వేసిన ఫయీజ్ సిద్ధిఖీ పూర్వ విద్యార్థి. తనకు సరైన విద్య బోధించకపోవడం వల్ల తన భవిష్యత్తు కోల్పోయానని పేర్కొన్నారు.

తాను భారత దేశ చరిత్రను (ఇండియన్ హిస్టరీ)ని స్పెషల్ సబ్జెక్ట్‌గా తీసుకున్నానని, తనకు సరిగా బోధించలేదని అతను చెప్పారు. ఇది 2000 సంవత్సరంలో జరిగింది.

ఫైనల్‌ పరీక్షల్లో ఆయనకు 2:1 డిగ్రీ సెకండ్‌ గ్రేడ్‌ వచ్చిందని, అయితే ఒక పేపర్‌కు సంబంధించి ట్యూటర్ పాఠాలు సరిగ్గా చెప్పలేదని, అందువల్లే తాను సెకండ్‌ గ్రేడ్‌ డిగ్రీ తీసుకోవాల్సి వచ్చిందని ఫైజ్‌ ఆరోపించారు.

Oxford graduate sues university for £1million because he did not get a first class degree

దీనివల్లే తాను ఐవీ లీగ్‌ యూనివర్శిటీలో ప్రొఫెషనల్‌ కోర్సు చేయలేకపోయాయని చెప్పారు. అధ్యాపకులు ఎక్కువగా సెలవులు పెట్టారని, అలాగే తన మెడికల్ సమాచారాన్ని తన ట్యూటర్ ఎగ్జామినర్‌కు చెప్పలేదని, దీంతో తనకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.

ఒకవేళ అప్పుడు పాఠాలు చెప్పి ఉంటే తాను ఇప్పుడు అంతర్జాతీయ కమర్షియల్‌ లాయర్‌ అయ్యేవాడినన్నారు. తనకు జరిగిన నష్టానికి గానూ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీపై 1 మిలియన్‌ యూరోల (రూ.8 కోట్లు) దావా వేశారు. ప్రస్తుతం దీనిపై లండన్‌ కోర్టులో విచారణ జరుగుతోంది.

English summary
An Oxford graduate is suing the university for £1million because he did not get a first class degree. Faiz Siddiqui claims he was the "victim of poor teaching" that cost him the chance of a lucrative legal career.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X