ప్లెబిసైట్: కాశ్మీర్‌పై నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన

న్యూయార్క్: పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారంనాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌ను లక్ష్యం చేసుకుంటూ కాశ్మీర్‌ విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారం పాకిస్తాన్‌కు చాలా చాలా కీలకమైందని ఆయన అన్నారు. కాశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే ప్లెబిసైట్‌ నిర్వహించాలని ఆయన కోరారు.

ఆరు దశాబ్దాల క్రితం కాశ్మీర్‌లో ప్లెబిసైట్‌లో నిర్వహించాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించిందని, ఇప్పటికీ అది జరగలేదని ఆయన అన్నారు. జమ్మూ-కాశ్మీర్‌ ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణమైన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి సమితి తమ తీర్మానాన్ని అమలు చేయాలని, అందుకు తాము కలిసికట్టుగా ముందుకు వ స్తామని ఆయన అన్నారు. కాశ్మీరీలు దురాక్రమణలో ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Nawaz Sharif

నవాజ్ షరీఫ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. భారత ప్రధాని న్యూయార్క్‌ చేరుకున్న అరగంటకే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రసంగం ప్రారంభమైంది. ఇటీవల జరగవలసిన కీలకమైన సమావేశం జరగలేదని, ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం అనీ ఆయన భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ సమావేశం రద్దు కావడానికి భారత్‌దే బాధ్యత అని కూడా నవాజ్‌ అన్నారు.

ఇరుగుపొరుగు దేశాలతో తమకు సత్సంబంధాలు కావాలని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి కొత్తగా ఎవరికీ శాశ్వత సభ్యత్వం ఇవ్వరాదని, దానివల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని కూడా సమితిని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సైతం తాము సత్సంబంధాలు, సహకారాలను కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులపై తమ పోరాటం కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+