వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ తీసుకున్నా పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి కొవిడ్-19 పాజిటివ్, రక్షణ మంత్రి పర్వేజ్‌కు కూడా

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్ వేవ్ పాకిస్తాన్ లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశాధినేతలను సైతం వదలకుండా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గతవారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ కరోనా కాటుకు గురికాగా, ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు, రక్షణ మంత్రికి సైతం వైరస్ సోకింది. విచిత్రంగా ప్రధానితోపాటు అధ్యక్షుడు కూడా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే పాజిటివ్ గా తేలారు.

సీఎం కేసీఆర్‌కు పాము కాటు తప్పదు -నల్లమలలో గిరిజనులపై అంత క్రూరత్వమా?: విజయశాంతి ఫైర్సీఎం కేసీఆర్‌కు పాము కాటు తప్పదు -నల్లమలలో గిరిజనులపై అంత క్రూరత్వమా?: విజయశాంతి ఫైర్

పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ అరిఫ్ అల్వీ కొవిడ్-19 బారిన పడ్డారు. వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న కొద్ది రోజులకే ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు అల్వి స్వయంగా సోమవారం ట్విటర్లో ఓ ప్రకటన చేశారు. తాను వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నప్పటికీ శరీరంలో ఇంకా యాంటీ బాడీల అభివృద్ధి ప్రారంభం కాలేదన్నారు.

 Pak Prez Arif Alvi tests positive for COVID-19 days after first dose of vaccine, Defence Min too

''ఇవాళ్టి టెస్టులో నాకు కొవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా బాధితులందరికీ అల్లా తోడైయుండాలి కోరుకుంటున్నా. నేను వ్యాక్సిన్ తొలిడోస్ వేయించుకున్నప్పటికీ.. 2వ డోస్ వేసుకున్న తర్వాతే యాంటీ బాడీలు తయారవుతాయి. దానికి ఇంకో వారం పడుతుంది.. అందరూ జాగ్రత్తగా ఉండండి...'' అని అధ్యక్షుడు అల్వీ ట్వీట్ చేశారు.

తిరుపతి పోరు: రత్నప్రభపై జనసైనికుల అసంతృప్తి నిజమే -ఉప సేనాని నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు -పవనే సీఎంతిరుపతి పోరు: రత్నప్రభపై జనసైనికుల అసంతృప్తి నిజమే -ఉప సేనాని నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు -పవనే సీఎం

పాక్ అధ్యక్షుడితోపాటే ఆ దేశ రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్ కు కూడా ఇవాళ కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారం రోజుల కిందటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొద్దిరోజులకే ఇన్ఫెక్షన్‌కు గురికావడం గమనార్హం. కాగా,

పాకిస్తాన్ లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి వేగంగా సాగుతోంది. తాజాగా 4,524 కొత్త కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,59,116కు, మరణాల సంఖ్య 14,256కు పెరిగింది. 5,98,197 మంది వ్యాధి నుంచి కోలుకోగా, ప్రస్తుతం 46,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

English summary
In a key development on Monday, both Pakistan's President Arif Alvi and Defence Minister Pervez Khattak have tested positive for the novel coronavirus. Pakistan's president Dr. Arif Alvi has tested positive for coronavirus, days after being administered the first jab of the vaccine. Alvi, who took to Twitter to share his health update also stated that while he had taken the first dose of the vaccine, antibodies had not started developing in his body yet. Pakistan Prime Minister Imran Khan too had tested positive for the virus over a week ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X