స్పై డ్రోన్: భారత రాయబారికి పాక్ సమన్లు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని భారత రాయబారికి ఆ దేశం సమన్లు జారీ చేసింది. పాక్‌-భారత్‌ సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వద్ద గూఢచర్యానికి ఉపయోగించే డ్రోన్‌తో ఏరియల్‌ వ్యూలో చిత్రాలు తీయడానికి భారత్‌ ప్రయత్నించి నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే తాము భారత రాయబారికి గురువారం సమన్లు జారీ చేశామని పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శి ఇజాజ్‌ అహ్మద్‌ చౌదరి తెలిపారు. ఈ మేరకు పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం నుంచి ఓ ప్రకటన జారీ చేశారు.

Pak summons Indian envoy over 'spy drone'; takes no action to curb border firing

పాకిస్థాన్‌ గగనతలంలోకి వచ్చి ఆ డ్రోన్‌ చిత్రాలు తీసిందని ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. బుధవారం పాక్‌ గగనతలంలోకి భారత్‌ డ్రోన్‌ ప్రవేశించడంతో దాన్ని పాక్‌ దళాలు పేల్చివేశాయంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భారత హైకమిషనర్‌ టిసిఏ రాఘవన్‌ ఈ వార్తల్ని ఖండించారు.

ఆ డ్రోన్ చైనాలో చేయబడిందని, పాక్ పోలీసులే దానిని నిఘా కోసం ఉపయోగించి ఉంటారని తెలిపారు. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలను భారత హై కమిషనర్ పాక్ దృష్టికి తీసుకెళ్లారు. పాక్ కాల్పుల్లో ఓ భారత మహిళ మృతి చెందిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+