పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అరెస్ట్..? సంచలన వీడియో బయటకు
భారత్ దెబ్బకు పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. పాకిస్థాన్ లోని లాహోర్, రాజధాని ఇస్లామాబాద్ లో దాడులు నిర్వహించింది భారత ఆర్మీ. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్.. దేశం విడిచి బహ్రెయిన్ పారిపోయే పరిస్థితి నెలకొంది. అటు బలూచిస్థాన్ కూడా పాకిస్థాన్ పై దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అరెస్ట్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
after the arrest of pakistan army chief asim munir, PM shehbaz sharif has also been taken into custody. the country is now under president’s rule, led by asif ali zardari.
— desi sigma (@desisigma) May 8, 2025
pakistan in chaos. power has shifted. pic.twitter.com/yrICMD9ViK
మరోవైపు పాకిస్థాన్ ప్రధాని.. ఇతర ఆర్మీ అధికారులతో కలిసి బహ్రెయిన్ పారిపోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక పాకిస్థాన్ లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత నేవీ పాకిస్థాన్ ను వణికిస్తోంది. రంగంలోకి 26 యుద్ధ నౌకలు దిగాయి. ఇప్పటికే కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి చేసింది. 1971 తర్వాత కరాచీపై భారత నేవీ దాడులు జరగడం ఇదే తొలిసారి. భారత్ దాడికి కరాచీలో 10 పోర్టులు ధ్వంసం అయినట్లు సమాచారం.
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్.. పాకిస్థాన్ లోని లాహోర్, సియోల్ కోట్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది.

మరోవైపు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాఠశాలలు మూసివేశారు. పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ తో సహా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications