పాక్ లో ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ.. ఆస్తులు సీజ్
పాకిస్తాన్ ప్రతిపక్ష నేత, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ) శుక్రవారం షాకిచ్చింది. ఓ కేసులో విచారణకు హాజరుకానందుకు ఆయన ఆస్తులు సీజ్ చేయాల
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రతిపక్ష నేత, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ) శుక్రవారం షాకిచ్చింది. ఇమ్రాన్‌ఖాన్, రాజకీయ నాయకుడిగా మారిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీల ఆస్తులు సీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది.
వారిపై నమోదైన ఉగ్రవాద కేసులకు సంబంధించి కోర్టు విచారణకు హాజరుకానందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది. 2014లో ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో హింస పెచ్చరిల్లింది. దీనికి కారణం వీరిద్దరేనంటూ సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అయితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపించడంతో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనుకంజ వేశారు. కాగా, ఈ కేసు విచారణకు ఇమ్రాన్, ఖాద్రీలు హాజరు కాకపోతుండడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు వారి ఆస్తులు సీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది.












Click it and Unblock the Notifications