వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో బీజేపీ గెలుపు: పాకిస్తాన్‌లో వణుకు.. ఎందుకంటే!

బీజేపీ విజయం పాకిస్తాన్‌ వెన్నులో వణుకు పుడుతోందట. యూరి దాడి తర్వాత పాకిస్తాన్‌తో అనుసరించే పాలసీ విషయాల్లో మార్పులను యూపీ ఎన్నికల తర్వాత చేయాలని బీజేపీ ప్రభుత్వం ఎదురుచూస్తోందని గతంలో వార్తలు వచ్చాయి

|
Google Oneindia TeluguNews

కరాచీ: యూపీలో బీజేపీ విజయం పాకిస్తాన్‌ వెన్నులో వణుకు పుడుతోందట. యూరి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో అనుసరించే పాలసీ విషయాల్లో మార్పులను యూపీ ఎన్నికల తర్వాత చేయాలని బీజేపీ ప్రభుత్వం ఎదురుచూస్తోందని గతంలో వార్తలు వచ్చాయి.

యూపీలో అఖండ మెజారీటీ సాధించిన బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. దీంతో పాకిస్తాన్‌తో అనుసరించాల్సిన పాలసీల్లో పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

యూరి దాడి తర్వాత పాకిస్తాన్ ఆగడాలను ఇక సహించేది లేదని భారత్ సిగ్నల్స్‌ ఇచ్చింది. సర్జికల్ స్ట్రయిక్స్, సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష వంటి నిర్ణయాలను తీసుకుంది.

uttar pradesh

దీంతో షాక్‌కు గురైన పాకిస్తాన్‌.. యూపీ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో ఉందంట. ఎన్నికల ప్రచారంలో యూపీ ప్రజలు మోడీ పాకిస్తాన్ పైన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు సమర్ధించారు. దీంతో మోడీ అలాంటి చర్యలనే భవిష్యత్తులో కొనసాగించే అవకాశముంది.

మోడీ గెలుపు తర్వాత తొలిసారి దేశంలో పర్యటించనున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌తో భద్రతా సంబంధాలను మరింత బలపర్చుకునే అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో అత్యధిక భాగం బోర్డర్‌ను కలిగి ఉన్న బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు ఎదురవుతున్న సమస్యలను తగ్గించేలా చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది.

English summary
What do the UP election results mean for the Modi government's Pakistan policy? There has been some speculation that the government had been waiting for the UP elections to be over to pick up the threads of engagement with Pakistan, which have gone into deep freeze since the Uri attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X