వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన పాక్: ఉగ్రవాది హఫీజ్ సంసపై నిషేధం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్ కనుసన్నల్లో నడుస్తున్న తెహ్రీక్ ఇ ఆజాదీ జమ్మూ అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే సంస్థ పేరు మార్చుకొని

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్ కనుసన్నల్లో నడుస్తున్న తెహ్రీక్ ఇ ఆజాదీ జమ్మూ అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే సంస్థ పేరు మార్చుకొని జమాత్ ఉద్ దవా (జేయూడీ) గా కొనసాగుతోంది.

2008 లో ముంబై పేలుళ్ళ సూత్రదాది ఈ సంస్థే. ఈ సంస్థను పాక్ ప్రస్తుతం నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. హాపీజ్ సయీద్ ను పాక్ జనవరి చివర్లోనే గృహ నిర్భంధంలోకి తీసుకొంది. జేయూడీపై ఓ కన్నేసి ఉంచింది.

hafiz saeed

అయితే తనకు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయని తెలుసుకొన్న సయీద్ భారత్ లో దాడుల కోసం తెహ్రీక్ ఈ ఆజాద్ ఈ కశ్మీర్ కు సంకేతాలు పంపారు. ఇదిలా ఉంటే పదిరోజుల క్రితం ట్రంప్ ప్రభుత్వం పాక్ కు తీవ్ర హెచ్చరికలను పంపింది. ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తోందని పాక్ భూభాగంలోకి ఉగ్రస్థావరాలపై డ్రోన్లతో దాడులకు దిగుతామని హెచ్చరించింది.

దీనికి తోడు ఇటీవల ట్రంప్ మోడీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంయుక్త ప్రకటన జారీ చేసింది. భారత్ అమెరికాలు దగ్గరవుతున్నట్టు భావిస్తున్న పాక్ తాజా చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సయీత్ సంస్థపై నిషేధం విధించినట్టు సమాచారం.

English summary
Tehreek-e-Azadi-Jammu and Kashmir, an outfit India claims is a front for Hafiz Saeed’s Jamaat-ud-Dawa, has been banned by Pakistan, The Times of India reported on Friday. Investigative agencies have said the JuD masterminded the 2008 Mumbai attacks, in which over 160 people had died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X