Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: ఆఫ్గన్‌లోనే కాదు-పాక్‌లోనూ మహిళల పరిస్థితి అంతే-మహిళా టిక్‌టాకర్‌పై 400 మంది దాడి,వివస్త్రను చేసి

ఆఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశమయ్యాక మహిళా హక్కులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహిళా భద్రతకు తాలిబన్లు హామీ ఇస్తున్నప్పటికీ ఆ మాటలను విశ్వసించే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం కుప్పకూలిన ఆ దేశంలో మహిళల భద్రత,భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారగా... పేరుకు ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే పాకిస్తాన్‌లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ కనిపించట్లేదు. ఓ మహిళా టిక్‌టాక్ స్టార్‌పై జరిగిన దాడే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఒకరు కాదు,ఇద్దరు ఏకంగా 400 మంది గుంపు ఆమెపై ఎగబడ్డారు. ఆమెను వివస్త్రను చేసి,అల్లరి చేసి పైశాచిక ఆనందం పొందారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక్కసారిగా 400 మంది ఆమెపై ఎగబడ్డారు...

ఒక్కసారిగా 400 మంది ఆమెపై ఎగబడ్డారు...

ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లాహార్‌లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ ప్రాంతంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు భారీగా జనం తరలివచ్చారు. ఓ మహిళా టిక్‌టాకర్ కొంతమంది తన గ్రూప్ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. మినార్ ఇ పాకిస్తాన్ వద్ద ఆమె వీడియో షూట్ చేస్తుండగా... ఒక్కసారిగా 300-400 మంది ఆమెపై ఎగబడ్డారు. ఆమె దుస్తులు చించివేసి... ఆమెను అమాంతం గాల్లోకి విసిరేసి... నానా హంగామా చేస్తూ ఆమెను అల్లరి చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ... అంతమంది నుంచి తప్పించుకోవడం ఆమె వల్ల కాలేదు.

సెల్‌ఫోన్,చెవి రింగులు,నగదు మాయం...

సెల్‌ఫోన్,చెవి రింగులు,నగదు మాయం...


అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారికి సాయం చేసే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా సఫలం కాలేదు. 'మినార్ ఇ పాకిస్తాన్' గేటు తెరిచి ఆ టిక్‌టాకర్,ఆమె టీమ్ అక్కడి నుంచి పారిపోయేందుకు వారు సహకరించారు. అయితే వందలాది మంది వెంటపడటంతో తప్పించుకోవడం అసాధ్యమైంది. ఆమెపై దాడికి పాల్పడటమే కాదు... ఆమె సెల్‌ఫోన్,చెవి రింగులు,ఆమె పర్సును దోచుకున్నారు.ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులకు ఫిర్యాదు... కేసు నమోదు...

పోలీసులకు ఫిర్యాదు... కేసు నమోదు...

మినార్ ఇ పాకిస్తాన్ వద్ద వీడియో చిత్రీకరిస్తుండగా 400 మంది తనతో పాటు తన టీమ్‌పై దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తన దుస్తులు చించివేశారని... పదేపదే గాల్లోకి విసిరేశారని... సాయం కోసం తాను ఎంత ఏడ్చినా లాభం లేకుండా పోయిందని వాపోయారు. ఆ మూక నుంచి తనను కాపాడేందుకు కొంతమంది ప్రయత్నించినప్పటికీ... అంతమందిని వారించడం వారి వల్ల కాలేదన్నారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్స్ 354 ఏ,382,147,149ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Recommended Video

    Afghanistan Vice President Trolls Pakistan | Oneindia Telugu

    ఆవేదన వ్యక్తం చేస్తున్న పాకిస్తానీలు...

    ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఆ మూకపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరియా అమీర్ అనే వ్యక్తి పాకిస్తానీ దీనిపై మాట్లాడుతూ... ఒక సమాజంగా మనం ఎంతదిగజారిన స్థితిలో ఉన్నామో అని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం,స్వేచ్చ అనే పదాలు కేవలం పురుషులకు మాత్రమే అని చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ ఏమీ ఉండదని పేర్కొన్నారు. 2020కి సంబంధించి ఇటీవల పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ విడుదల చేసిన నివేదకలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా మహిళా హక్కులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని... వారి పట్ల దాడులు,హింస పెచ్చరిల్లుతున్నాయని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+