వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ ఎఫెక్ట్: భారత రాయబారిని బహిష్కరించిన పాకిస్థాన్...!

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ విషయంలో నేరుగా ఎలాంటీ చర్యలు చేపట్టలేని పాకిస్థాన్ దోంగచాటు వ్యవహారాలకు తెరలేపింది. కశ్మీర్ పరిణామాలతో ఆదేశ భారత రాయబారిని బహిష్కరించింది. దీంతో పాటు భారత్‌లో ఉండాల్సిన పాకిస్థాన్ రాయబారిని భారత దేశానికి పంపకూడదని నిర్ణయించింది. భారత హై కమీషనర్‌ను బహిష్కరించిన నేపథ్యలోనే రాయబారిని వెనక్కి వెళ్లాలని కోరనుంది.

భారత ప్రభుత్వం తీసుకున్న సహసోపేతమైన నిర్ణయం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి. ఈనేపథ్యలోనే జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్స్ రద్దు తోపాటు కశ్మీర్ విభజన అంశాలపై పాకిస్థాన్ విషం చిమ్ముతోంది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్యపరమైన చర్యలకు కూడ ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది.

Pakistan calls back high commissioner, expels Indian envoy

కశ్మీర్ పరిణామాల్లో భాగంగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటి సమాశమైంది. ఈనేపథ్యంలో రెండు దేశాల మధ్య వ్యాపార మార్గమైన వాఘా సరిహద్దును మూసి వేయాలని కమిటి నిర్ణయించింది. వాఘా సరిహద్దు మూసి వేత వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆగిపోతుంది. చట్టప్రకారం జరిగే రాకపోకలుఆగిపోతాయి. భారత దేశం నుండి ఎగుమతి అయ్యే ఉత్పత్తులు నిలిచితాయి.

అయితే పాకిస్థాన్ తన సరిహద్దులను మూసి వేయడం వల్ల భారత్‌కు ఎలాంటీ నష్టం వాటిల్లదని మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలను మూసివేయాలన్న నిర్ణయం పాకిస్థాన్‌కే తాత్కాలిక ఏర్పడుతుందని అన్నారు. కాగా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్‌ నిర్వహించిన తర్వాత ఆదేశ గగనతలంపై విమాన రాకపోకలను పాకిస్థాన్ కొద్ది రోజుల పాటు నిషేధించింది. అయితే భారత ప్రభుత్వం విజ్ఝప్తి తర్వాత నిషేధాన్ని తొలగించింది.

English summary
Pakistan has announced that it will call its high commissioner back from India and expel the Indian envoy to Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X