పాకిస్తాన్ ఓపెన్ వార్: అట్టుడుకుతున్న కాబుల్, కాందహార్- 55 మంది సైనికులు మృతి

పొరుగుదేశం అఫ్ఘానిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఆ దేశ భూభాగంపై మెరుపుదాడులు చేసింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ ఘటనలు 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడులను అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించాయి. సరిహద్దుల వెంబడి ఏడుచోట్ల వైమానిక దాడులు చోటు చేసుకున్నట్లు నిర్ధారించాయి.

కాబుల్, కాందహార్ పై బాంబింగ్..

దీనికి కొనసాగింపుగా తాజా పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్‌లోని పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పలు పేలుళ్లు సంభవించాయి. విమానాల శబ్దాలు వినిపించాయి. మిస్సైళ్ల మోతలతో ఉలిక్కిపడింది కాబుల్. మరో ప్రధాన నగరం కాందహార్ తో పాటు పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటోన్న పక్టికాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మెరుపుదాడులతో ఆప్ఘనిస్తాన్ నగరాలు అట్టుడికిపోయాయి. ఈ దాడుల్లో 55 మంది సైనికులు మరణించినట్లు సమాచారం.

Pakistan Declares Open War with Afghanistan as Cross-Border Clashes Intensify on Kabul and Kandahar

భారీ నష్టం..

ఈ దాడుల్లో తాలిబన్ ప్రభుత్వ ఆర్మీ కార్యాలయాలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. కాందహార్‌లో ఓ కార్ప్స్ హెడ్‌క్వార్టర్, బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్‌తో పాటు మందుగుండు డిపో, లాజిస్టిక్స్ బేస్ ధ్వంసం అయ్యాయి. పక్టియాలోనూ ఒక కార్ప్స్ హెడ్‌క్వార్టర్ నేలమట్టమైనట్లు ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ పీటీవీ తెలిపింది. ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరావట్లేదని, మరణాలు సంభవించి ఉండకపోవచ్చని అంచనా వేసింది.

పిరికి పాకిస్తాన్

దాడులు జరిగిన వెంటనే తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ దీనిపై మాట్లాడారు. కాబూల్, కందహార్, పక్టియా ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసిందని ఆరోపించారు. పిరికి పంద చర్యగా అభివర్ణించారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఈ దాడులను ఖండించారు. ఈ దాడులను ఆఫ్ఘన్ ధైర్యంగా తిప్పికొడుతుందని, పాకిస్తాన్ హింస, బాంబు దాడుల నుండి తమను తాము ఇంకా విముక్తి చేసుకోలేదని విమర్శించారు. ఈ చర్యను స్వయంకృతాపరాధంగా పేర్కొన్నారు.

రాజీ పడబోం.. ఆసిఫ్ అలీ జర్దారీ

కాబూల్‌లో పేలుళ్ల వార్తలు వెలువడిన కొద్దిసేపటికి ఈ విషయాన్ని పాకి సమాచార శాఖ మంత్రి తెరమీదికి వచ్చారు. ఈ దాడులను ధృవీకరించారు. ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడులు జరిగాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ ఘటనలపై స్పందించారు. పాకిస్తాన్ శాంతికి, ప్రాంతీయ సమగ్రతకు ఎటువంటి రాజీ పడబోదని, ప్రతిదాడులు సంపూర్ణంగా ఉంటాయని అన్నారు. శాంతిని బలహీనతగా భావించే వారికి కఠిన సమాధానం లభించితీరుతుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+