ఉరిశిక్ష అమలైన 87 ఏళ్ల తర్వాత.. భగత్‌సింగ్ కేసు విచారణ పత్రాలు బయటపెట్టిన పాకిస్తాన్!
లాహోర్: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించిన 87 ఏళ్ల అనంతరం ఆయన కేసుల విచారణకు సంబంధించిన పత్రాలన్నింటిని పాకిస్తాన్ ప్రభుత్వం తొలిసారిగా బహిర్గత పరిచింది. సోమవారం వీటిని లాహోర్‌లోని అనార్కలీ స్మారకకేంద్రం వద్ద ఉన్న పంజాబ్ రాష్ట్ర ఆర్కీవ్స్ విభాగంలో ప్రదర్శనకు ఉంచారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్ సయీద్ సమక్షంలో ఇటీవల ఒక ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భగత్‌సింగ్ భారత్, పాక్ దేశాలకు చెందిన హీరో అని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం ఇరుదేశాల ప్రజలకు తెలియాలి అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

భగత్‌సింగ్ కేసు విచారణ పత్రాలు బహిర్గతం...
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్ని పోలీస్ అధికారి జాన్ పి శాండర్స్‌ను హతమార్చిన కేసులో భగత్‌సింగ్‌తోపాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పలు పత్రాలను సోమవారం లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్ద ఉన్న పంజాబ్ రాష్ట్ర ఆర్కీవ్స్ విభాగంలో ప్రదర్శనకు ఉంచారు.

ఉరిశిక్ష ఉత్తర్వు ప్రతి కూడా..
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ కేసు విచారణకు సంబంధించిన పత్రాలలో ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ప్రతి కూడా ఉంది. దీంతోపాటు, పోలీస్ అధికారి శాండర్స్, కానిస్టేబుల్ చరణ్‌సింగ్ మృతదేహాల పోస్టుమార్టం నివేదికలను కూడా ప్రదర్శనకు ఉంచారు. అంతేకాదు, 1929 మే31న తన కుమారుడికి విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ భగత్‌సింగ్ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్, 1930 ఆగస్టు 27న న్యాయస్థానానికి భగత్‌సింగ్ చేసుకున్న అర్జీ కూడా ఇందులో ఉన్నాయి.

వారు నివసించిన ప్రాంతాల చిత్రాలు...
పాకిస్తాన్ తాజాగా బయటపెట్టిన పత్రాలలో... స్వాతంత్ర్య పోరాట సమయంలో భగత్‌సింగ్, ఆయనతో కలిసి పని చేసిన 25 మంది అనుచరుల సమాచారం, హిందూస్థాన్ సోషలిస్ట్ రెవల్యూషనరీ ఆర్మీ, నవజవాన్ భారతసభలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అజ్ఞాతంలో ఉన్నప్పుడు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు నివసించిన, తలదాచుకున్న పలు ప్రాంతాలు, భవనాల చిత్రాలను కూడా ప్రజల సందర్శనార్థం ఉంచారు.

ఇంకా ఏమేం ఉన్నాయంటే...
భగత్‌సింగ్‌కు ఉరిశిక్షను అమలు చేసినట్లుగా లాహోర్ జైలు సూపరింటెండెంట్ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, అలాగే తనకు పుస్తకాలు, వార్తాపత్రికలు అందించాల్సిందిగా కోరుతూ భగత్‌సింగ్ పెట్టుకున్న దరఖాస్తు, జైలు నుంచి భగత్‌సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు.. ఇవన్నీ కూడా ప్రదర్శనలో ఉన్నాయి. బీసీ వోహ్రా రాసిన నవజవాన్ భారత్‌సభ మేనిఫెస్టో ప్రతులు, వీర్‌భారత్ దినపత్రిక క్లిప్పింగులు కూడా ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇంకా మంగళవారం కూడా స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన పలు పత్రాలను, రికార్డులను ఈ ప్రదర్శనలో ఉంచారు.

భగత్‌సింగ్ చదివిన కాలేజి, పుస్తకాలు....
అప్పట్లో డీఏవీ కళాశాలలో భగత్‌సింగ్ అడ్మిషన్ పొందిన రికార్డులు, ఆయన చదివిన.. పంజాబ్ ట్రాజెడీ, జక్మీ పంజాబ్, గంగాదాస్ డాకూ, సుల్తానా డాకూ, ది ఎవల్యూషన్ ఆఫ్ సిన్‌ఫెన్, ది హిస్టరీ ఆఫ్ ది సిన్‌ఫెన్ మూవ్‌మెంట్ తదితర పుస్తకాలను కూడా పాకిస్తాన్ తొలిసారిగా ప్రజల సందర్శనార్థం పంజాబ్ రాష్ట్ర ఆర్కీవ్స్ విభాగంలో ప్రదర్శనకు ఉంచింది.

దటీజ్ భగత్‌సింగ్...
భారత స్వాతంత్య్రోద్యమంలో విప్లవపంథాను అనుసరించిన భగత్‌సింగ్ తాను బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలు, జైలు అధికారులకు పంపిన దరఖాస్తులన్నింటిలోనూ... కింద మీ విశ్వాసపాత్రుడు/ విధేయుడు (యువర్స్ ఒబిడియంట్లీ) వంటి పదాలను వాడలేదు. ఆ స్థానంలో ‘మీ.. తదితరులు (యువర్స్.. ఎట్సెట్రా)' అని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టి భగత్‌సింగ్ ధీరత్వం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications