భారత్ ను ఊహించని దెబ్బ కొట్టిన పాక్.. రూ. వందల కోట్లు నష్టం..

ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. భారత్ దెబ్బకు దాదాపు 200 మంది ఉగ్రమూకలు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ గతంలో పేర్కొంది. అంతేకాక పాకిస్థాన్ ఆర్థిక మూలాలపైనా భారత్ దెబ్బ కొట్టింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, సింధూ జలాల పంపిణీ నిలిపివేత, ఇలా కఠిన చర్యలు చేపట్టింది.

అయితే భారత్ చేపట్టిన ఆంక్షలకు బదులుగా పాకిస్థాన్ సైతం భారత్ పై ఆంక్షలు విధించింది. వాటిల్లో ప్రధానమైనది పాక్ గగనతలం మూసివేత. భారత్ విమానాలు పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లకుండా ఆ దేశం ఆంక్షలు విధించింది. అయితే తాజాగా ఈ ఆంక్షలను మరికొద్దిరోజుల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 24 వరకు ఆ బ్యాన్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్, మిలిటరీ లేదా ఇతర విమానాలు భారత్ నుంచి పాకిస్థాన్ గగనతలం నుంచి వెళ్లకుండా ఈ నిషేధం విధించింది. ఈ మేరకు పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Pakistan Extends Airspace Ban on Indian Flights Until August 24 2025

మరోవైపు భారత్ కూడా పాకిస్థాన్ విమానాలు భారత గగనతలం గుండా వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు జులై 24 వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని పొడిగించే అవకాశం ఉంది. పాకిస్థాన్ పై మొదటిసారిగా భారత్ ఏప్రిల్ 30 న ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 22 న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. టైమ్ లైన్ పరిశీలిస్తే.. ఏప్రిల్ 24 న తొలిసారి పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 30న భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దౌత్య పరమైన చర్చలు, సమావేశాలు రద్దు అయ్యాయి.

మరోవైపు సింధూ జలాల పంపిణీ రద్దును పున సమీక్షించుకోవాలని భారత్ కు పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాసింది. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఇక సింధూ నదీజలాల ఒప్పందం 1960లో జరిగింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది.

ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న సంతకాలు చేశాయి. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థ నుండి 20 శాతం నీటిని భారత్ కు.. మిగిలిన 80శాతం నీటిని పాకిస్థాన్ కు ఇవ్వాలని ఈ ఒప్పందంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+