మళ్లీ తప్పులో కాలేసిన పాకిస్తాన్, పరువు గంగలో కలిసింది
పాకిస్తాన్ మరోసారి తప్పులో కాలేసింది. గతంలో జమ్ము కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికపై భారత్ పైన బురద జల్లేందుకు తప్పుడు ఫోటో ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.పర్యాటక రంగ ప్రచారం కోసం ఇప్పుడు ఏకంగా పక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి తప్పులో కాలేసింది. గతంలో జమ్ము కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికపై భారత్ పైన బురద జల్లేందుకు తప్పుడు ఫోటో ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.
పర్యాటక రంగ ప్రచారం కోసం ఇప్పుడు ఏకంగా పక్క దేశం మసీదును తమ దేశానిదిగా పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ టూరిజం శాఖ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

పాకిస్తాన్‌లోని ప్రముఖ వారసత్వ కట్టడాలను హైలెట్ చేసేందుకు తయారు చేసిన ఆ వీడియోలో అప్గనిస్తాన్‌లోని హజ్రత్ అలీ పవిత్ర క్షేత్రాన్ని కూడా పెట్టింది. మజర్ ఇ షరీఫ్‌లో ఉన్న ఈ మసీదును బ్లూ మసీదు అని పిలుస్తారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందించారు. దీంతో పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. దీంతో అక్కడి అదికారులు హుటాహుటిని వీడియోను డిలీట్ చేశారు.












Click it and Unblock the Notifications