పాక్ సర్కార్ బిగ్గెస్ట్ బక్రీద్ గిఫ్ట్.. వాళ్లకు 500 శాతం జీతాలు పెంపు.. దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
అప్పు చేసి పప్పు కూడు అంటే ఇదేనేమో.. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ అతలాకుతలం అయిపోయింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ కఠినమైన చర్యలు తీసుకుంది. సింధూ జలాల పంపిణీ ఒప్పందం నిలిపివేత, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ నిలిపివేత, ఎగుమతులు దిగుమతులు రద్దు, పాకిస్థాన్, భారత గగతలాలు మూసివేత.. తదితర నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాకిస్థాన్ ఆర్థికంగా దెబ్బతింది.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్.. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు పొందింది. అయితే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ అప్పు చేసి పప్పు కూడు ధోరణిని ఆవలంభిస్తోంది. తాజాగా దేశంలోని ఎంపీలకు జీతాలు పెంచింది షరీఫ్ సర్కార్. ఎంపీల జీతాలను 500శాతం పెంచినట్లు సమాచారం అందుతోంది.
ఐఎంఎఫ్ రుణం ఇచ్చిన కొద్ది రోజులకే పాకిస్థాన్ సర్కార్ ఎంపీలకు జీతభత్యాలు పెంచడంతో దేశ ప్రజలు, నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతోంది.. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మీకు మీరు జీతాలు పెంచుకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పాకిస్థాన్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం అసెంబ్లీ స్పీకర్, ఛైర్మన్ ల జీత భత్యాలను రూ. 10 లక్షల 30 వేలకు పెంచింది. గతంలో వీరి జీతం నెలకు రూ. 2 లక్షలు ఉండేది. అంటే వీరి జీతం 500 శాతం పెంచినట్లు తెలుస్తోంది. షెహబాజ్ షరీఫ్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐఎంఎఫ్ ఇటీవల పాకిస్థాన్ 1 బిలియన్ డాలర్ల లోన్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని వారాలకు పాక్ కు ఈ లోన్ ప్రకటించింది అంతర్జాతీయ సంస్థ. ప్రస్తుతం ఐఎంఎఫ్ నుంచి అత్యధికంగా అప్పు తెచ్చుకుంటున్న నాలుగో దేశంగా పాకిస్థాన్ ఉంది. ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు 10.4 బిలియన్ డాలర్లు రుణం పొందింది పాకిస్థాన్.

ఇక పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 35. 37 శాతం ఉంది. గత 50 ఏళ్లలో ఇదే అత్యధికం. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications