పాకిస్థాన్ లో వరుసగా 7 భూకంపాలు.. ఒకదానికి మించి మరొకటి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే ఇదేనేమో.. ఏరికోరి భారత్ తో పెట్టుకుని
తలపట్టుకున్న పాకిస్థాన్ ను ప్రకృతి కూడా క్షమించడం లేదు. పాకిస్థాన్ లో తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్ మే 30న మధ్యాహ్నం సమయంలో భూకంపం ఏర్పడింది. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ స్పష్టం చేసింది. భూకంప కేంద్రం భూమి నుంచి 180 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది.
పాకిస్థాన్ లో మే 30న మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. భూకంప తీవ్రత భూమికి 180 కిలోమీటర్ల లోతులో ఉందని వివరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

మే 29న గురువారం కూడా పాకిస్థాన్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్ లోని ముల్తాన్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఒక్క మే నెలలోనే దాదాపు 7 సార్లు పాకిస్థాన్ లో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో పాకిస్థాన్ అట్టుడికి పోతోంది.
ఓవైపు భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. మరోవైపు పాకిస్థాన్ లో భారీ భూకంపాలు.. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మే 30, 29,24 తేదీల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. అంతకుముందు మే 12న పంజాబ్ ప్రావిన్స్ లోని ఫైసలాబాద్ ప్రాంతంలోని ఝంగ్ మండలంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.2 గా ఉంది. 111 కిలోమీటర్ల లోతులో భూకంపం తీవ్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మే 10న కూడా పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 4.0 తీవ్రత నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అంతేకాక మే 5న 4.2 తీవ్రతతో ఈ నెలలో తొలిసారి భూకంపం ఏర్పడింది. ఇలా ఒకే నెలలో 7 సార్లు భారీ భూకంపాలు పాకిస్థాన్ లో సంభవించాయి.
EQ of M: 4.2, On: 30/05/2025 13:37:52 IST, Lat: 32.57 N, Long: 69.82 E, Depth: 180 Km, Location: Pakistan.
— National Center for Seismology (@NCS_Earthquake) May 30, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/NpHzIB1UPN
ప్రపంచంలోనే భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో పాకిస్థాన్ ఒకటని నిపుణులు వెల్లడించారు. పాకిస్థాన్ దేశం భౌగోళికంగా యూరేషియా, భారత్ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఉందని.. దీని కారణంగా సింధ్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలు, జమ్ము కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు ఏర్పడుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications