భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా ఒకదాన్నొకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇరాన్ పై దాడులను ఐదు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఇక యుద్ధం ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ ఇరాన్ లోని డ్రోన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మిసైల్ లాంచ్ ప్యాడ్ లు, పలు కీలక కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా తాజాగా ప్రకట చేసింది. ఇక 25 రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ లో ఇప్పటివరకూ దాదాపు 1500 మందికిపైగా మరణించినట్లు ఇరాన్ యంత్రాంగం పేర్కొంది.
అయితే ఇప్పుడు ఇరాన్- అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు పాకిస్థాన్.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆఫ్గానిస్తాన్ తో యుద్ధం, భారత్ తో విభేదాలు.. ఇంకా ఆ దేశంలో నెలకున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఇలా చాలానే ఆ దేశాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు పాకిస్థాన్ ముందుకు రావడం గమనార్హం.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ఈ యుద్ధం ఆగిపోతే ముందుగా సంతోషపడే దేశం పాకిస్థాన్ మాత్రమే.. ఎందుకంటే యుద్ధ ప్రభావం పాకిస్థాన్ పై చాలానే ఉంది. అందుకే పాకిస్థాన్ ఈ చర్చల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పాకిస్థాన్ డిఫెన్స్ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ట్రంప్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ పై ట్రంప్ ఐదు రోజులు బ్రేక్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది.
పాకిస్థాన్ కు అటు ఇరాన్ ఇటు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఒమన్, టర్కీ లాంటి దేశాల కంటే పాకిస్థాన్ ను ఇరాన్- అమెరికా సెన్సిటివ్ మెసేజ్ లు చేరవేసేందుకు నమ్ముతాయి. ఇక ఇరాన్ తో పాకిస్థాన్ దాదాపు 1000 కి. మీ. సరిహద్దును కలిగి ఉంది. ఇరాన్ తర్వాత పాకిస్థాన్ లోనే షియా ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. మరోవైపు 1947 లో పాకిస్థాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించిన తొలి దేశాల్లో ఇరాన్ ఒకటి.
మరోవైపు పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇటీవలికాలంలో సాన్నిహిత్యం బాగా పెరిగింది. అసిమ్ మునీర్ ను తన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ గా ట్రంప్ గతంలో అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య సంధి కుదిర్చే సామర్థ్యం పాకిస్థాన్ కు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యుద్ధం కారణంగా ఇప్పటికే పాకిస్థాన్ అస్తవ్యస్తం అయింది.

భారత్ మాదిరిగానే పాకిస్థాన్ కూడా చమురు కోసం ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆధారపడాల్సిందే. ఇక చమురు కొరత కారణంగా ఇప్పటికే పాకిస్థాన్ లో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య సంధి కుదుర్చేందుకు పాకిస్థాన్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.అదే గానీ జరిగి ఇరు దేశాల మధ్య చర్చలు సఫలీకృతం అయితే పాకిస్థాన్.. భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ చెప్పినట్లుగా భావించవచ్చు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications