వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ హద్దు మీరింది: ఫిర్యాదు చేసిన పాక్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని నియత్రణ రేఖ వెంబడి భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్ ఆరోపిస్తున్నది. ఇదే విషయంపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నది.

భారత్ జరిపిన కాల్పులపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితికి చెందిన భారత్, పాకిస్థాన్ లోని సైనిక పరిశీలకుల బృందాలకు (యూఎన్ఎంజీఐపీ) ఫిర్యాదు చేసింది. భారత్ మీద దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పాక్ సైన్యం డిమాండ్ చేస్తున్నది.

Pakistan lodges complaint against India in un

భారత్ కాల్పులు జరపడం వల్ల మా దేశం సరిహద్దులోని గ్రామాలలో నివాసం ఉంటున్న నలుగురు మరణించారని పాక్ ఆరోపిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని ప్రజలపై భారత్ సైన్యం మిషిన్ గన్లు, భారీ మోటార్లుతో దాడులు చేస్తున్నదని ఆరోపించారు.

తమ సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతున్నదని భారత్ ఫిర్యాదు చేసిన నేపద్యంలోనే పాక్ భారత్ మీద ఫిర్యాదు చెయ్యడం కొసమెరుపు. 1949 నుండి భారత్- పాక్ నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ అంశాన్ని యూఎన్ఎంజీఐసీ పరిశీలిస్తున్నది.

English summary
Pakistan on Friday lodged a complaint against India with the UN military observer group for “ceasefire violations” along the Line of Control (LoC) in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X