ఫైనల్ గా పాకిస్తాన్ ను హీరోను చేశారు కదరా: ఇస్లామాబాద్ ఆతిథ్యం
అయిదువారాల పాటు ఏకధాటిగా కొనసాగిన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కు ఆయా దేశాలు అంగీకరించాయి. ఆ వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపిన 10 సూత్రాల ప్రతిపాదనపై ఈ నెల 10న ఇస్లామాబాద్‌లో ఇరు పక్షాలు చర్చించనున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు రంగం సిద్ధమైందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది.
ఈ చర్చలు- ఉద్రిక్తతలను తగ్గించడం లేదా యుద్ధానికి ముగింపు కాదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తేల్చి చెప్పింది. తమ చేతులు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని, ఏ పొరపాటు జరిగినా కూడా పూర్తి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణను ఇరాన్ తమ విజయంగా అభివర్ణించింది. అమెరికా అంగీకరించేలా చేశామని ప్రకటించుకుంది.

ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి పాకిస్తాన్ కారణమని తేల్చి చెప్పారు. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన అత్యవసర బ్యాక్‌ఛానెల్ విజ్ఞప్తులే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ పరిణామంలో పాకిస్థాన్ ప్రధాన మధ్యవర్తిగా నిలవగా, ఉద్రిక్తతలను తగ్గించాలని చైనా కూడా పిలుపునిచ్చింది. తనవంతు తోడ్పాటు అందించింది.
కాల్పుల విరమణను ప్రకటించడానికి ముందు తాను షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో చర్చలు జరిపానని, దీని తర్వాతే సీజ్ ఫైర్ నిర్ణయానికి వచ్చానని ట్రంప్ వెల్లడించారు. ఈ రాత్రి ఇరాన్‌కు పంపే విధ్వంసక శక్తిని ఆపాలని వారు కోరారని, దీనికి తాను అంగీకరించానని అన్నారు. హార్ముజ్‌ను తక్షణమే, సురక్షితమైన రీతిలో తెరవడానికి అంగీకరిస్తే రెండు వారాల పాటు ఇరాన్‌పై బాంబు దాడులను నిలిపివేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. షరీఫ్, మునీర్ ప్రత్యక్ష బ్యాక్‌ఛానెల్ విజ్ఞప్తుల అనంతరం ఈ చర్య తీసుకున్నానని పునరుద్ఘాటించారాయన.
మధ్యవర్తిత్వంలో భాగంగా, ఆసిమ్ మునీర్ గత రెండు రోజులలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాచిలతో కూడా చర్చలు జరిపినట్లు అల్ జజీరా వెల్లడించింది. చైనా కూడా కీలక పాత్ర పోషించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తులు కూడా భాగస్వామ్యం అయ్యారని, కాల్పుల విరమణ వైపు ఇరాన్ ను నడిపించారని పేర్కొంది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కాల్పుల విరమణ ఫ్రేమ్‌వర్క్‌ను అంగీకరించినట్లు ధృవీకరించింది. ఈ నెల 10వ తేదీన ఇస్లామాబాద్‌లో అమెరికాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే, కాల్పుల విరమణకు పాకిస్తాన్ కేంద్ర బిందువు అయింది. తానే స్వయంగా వాటికి ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది కూడా.
-
అమెరికాపై డ్రాగన్ దాడి.. ఇరాన్ చేతికి యుద్ధ వ్యూహాలు! -
మీ చావు మీరు చావండి: అన్ని గేట్లు మూసేసిన ఇరాన్.. -
పనామా బ్రిడ్జిపై భారీ పేలుడు- సీసీటీవీ ఫుటేజీలో -
లైఫ్ టైమ్ సెటిల్మెంట్- ఓ మనిషి జీవితకాలంలో ఎప్పుడూ చూడని అద్భుతాన్ని వీక్షించారు -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..!












Click it and Unblock the Notifications