పాకిస్థాన్‌కు పెద్ద ముప్పు: భారత్‌పై విరుచుకుపడ్డ పాక్ మంత్రి!

సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తప్పుడు వైఖరి అవలంబిస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఆరోపించారు. భారత్ ఎగువ దేశమని, అక్కడి నుంచి నదులు పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తాయని ఇక్బాల్ పేర్కొన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని భారత్ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నీటిని ఓ ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. దక్షిణాసియాలో పరిస్థితులు సజావుగా సాగడానికి, స్థిరత్వానికి భారత్ పాత్ర కీలకమని కూడా అహ్సాన్ ఇక్బాల్ అన్నారు. ఓ కార్యక్రమంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే భారత నిర్ణయం గురించి అహ్సాన్ ఇక్బాల్‌ను ప్రశ్నించగా.. అవసరమైన సమయాల్లో నీటి సరఫరాను నిలిపివేయడానికి భారత్ నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించగలిగే ముప్పును పాక్ ఇప్పుడు ఎదుర్కొంటోందని ఆయన సమాధానమిచ్చారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లు

భారత్ పాత్ర కీలకం
ప్రాంతీయ స్థిరత్వానికి, ముఖ్యంగా దక్షణాసియాలో శాంతికి భారత్ కీలకమని పాకిస్థాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పేర్కొన్నారు. దక్షిణాసియాకు భారత్ సరిగ్గా మధ్యలో ఉందని.. మిగతా దేశాలన్నీ దాని చుట్టూ ఉన్నాయని ఆయన అన్నారు. అందువల్ల దక్షిణాసియా సజావుగా పనిచేయడానికి భారత్ పాత్ర చాలా కీలకం. స్థిరత్వానికి ముప్పు కలిగించే చర్యలను భారత్ తీసుకోకూడదు. సింధు నది జలాల ఒప్పందం విషయంలో అహ్సాన్ ఇక్బాల్ భారత్‌పై నిరంతరం అనేక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. గతేడాది ఆగస్టులో పంజాబ్‌లో సంభవించిన వరదలకు ఆయన ఇండియాను నిందించారు. భారత్ నీటిని ఓ ఆయుధంగా వాడుతోందని అప్పుడు పేర్కొన్నారు. రావి, సట్లేజ్ నదులలోకి భారత్ నీటిని విడుదల చేయడం వల్ల పాకిస్థాన్‌లోని పంజాబ్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో వరదలు సంభవించాయి.

Pakistan Minister Ahsan Iqbal Accuses India of Using Water as Weapon Following Indus Waters Treaty Suspension
రూపాయి రాజసం, డాలర్ అవసరం లేదు.. ఇక అంతా మన కరెన్సీలోనే
రూపాయి రాజసం, డాలర్ అవసరం లేదు.. ఇక అంతా మన కరెన్సీలోనే

సింధు జలాల ఒప్పందం
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. 1960లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. నదుల నీటిని భారత్, పాకిస్థాన్‌ల మధ్య పంచుకుంటారు. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్థాన్‌కు నీటి సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం సింధు ఒప్పందం అంశాన్ని మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకువెళ్లడంతో పాటు భద్రతా మండలిలో కూడా దీనిని లేవనెత్తింది. ఈ విషయంలో భారత్‌పై ప్రపంచవ్యాప్త ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని భారత్ తన వైఖరిని కొనసాగించింది. ఫలితంగా, పాకిస్థాన్ ఈ విషయంపై భారత్‌కు వ్యతిరేకంగా నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+