వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కొత్త అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీవి భారత మూలాలే..తండ్రి నెహ్రూకు డెంటిస్ట్‌గా పనిచేశారు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో కొత్త శఖం ప్రారంభమైంది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానిగా ఎన్నుకోబడగా... కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ ఆరిఫ్ అల్వి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టగానే తనకు భారత్‌తో ఉన్న సంబంధాన్ని ఆరిఫ్ నెమరువేసుకున్నారు. తన తండ్రి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు డెంటిస్ట్‌గా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. 69 ఏళ్ల ఆరిఫ్ అల్వీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు.

వరదలను జయించి వికసించిన పుష్కర పుష్పాలు : మున్నార్‌లో పన్నెండేళ్లకోసారి కనువిందు చేసే పువ్వులువరదలను జయించి వికసించిన పుష్కర పుష్పాలు : మున్నార్‌లో పన్నెండేళ్లకోసారి కనువిందు చేసే పువ్వులు

డాక్టర్ ఆరిఫ్ అల్వితో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి ఐతాజ్ అహసాన్, నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నుంచి మౌలానా ఫజుల్ ఉర్ రెహ్మాన్‌లు అధ్యక్ష పదవికి పోటీచేయగా... విజయం డాక్టర్ ఆరిఫ్‌ను వరించింది. దీంతో పాకిస్తాన్ 13వ అధ్యక్షుడిగా డాక్టర్ ఆరిఫ్ రికార్డులకెక్కారు.

Pakistan new president is the son of Nehrus dentist

ఆరిఫ్ అల్వీకి కేవలం నెహ్రూకు సంబందించిన డెన్టిస్ట్ కుమారుడిగానే భారత్‌తో సంబంధం లేదు..తన తల్లిదండ్రులు భారత్ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లి ఆ దేశానికి అధ్యక్షులుగా ఐనవారిలో ఆరిఫ్ కూడా ఉన్నారు. అంతకుముందు ఇలా భారత్ నుంచి తమ కుటుంబం పాక్‌కు వలస వెళ్లి ఆదేశానికే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారిలో మమ్నూన్ హుస్సేన్, పర్వేజ్ ముషారఫ్‌లున్నారు. మమ్నూన్ కుటుంబం దేశ విభజన సమయంలో ఆగ్రా నుంచి పాక్‌కు వెళ్లగా ముష్రాఫ్ కుటుంబం ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌కు వలసపోయింది.

డాక్టర్ ఆరిఫ్ తండ్రి డాక్టర్ హబీబ్ ఉర్ రెహ్మాన్ ఇలాహి దేశ విభజనకు ముందు నెహ్రూకు డెంటిస్ట్‌గా ఉండేవారని పాకిస్తాన్ తెహ్రీక్ పార్టీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. దేశ విభజన తర్వాత డాక్టర్ ఆరిఫ్ కుటుంబం పాకిస్తాన్‌కు వెళ్లగా... 1949లో డాక్టర్ ఆరిఫ్ జన్మించారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన డాక్టర్ ఆరిఫ్ తాను కూడా మంచి డెంటిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుని కరాచిలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆరిఫ్ తండ్రికి జిన్నా కుటుంబంతో కూడా సంబంధాలున్నాయి. జిన్నా సోదరి శ్రీన్‌భాయ్ జిన్నా ఏర్పాటు చేసిన ట్రస్టులో ట్రస్టీగా ఉన్నారు. దీంతో ఆమె డాక్టర్ ఆరిఫ్ తండ్రికి విలువైన కానుకలు ఇచ్చింది. ఇందులో కరాచీలోని మొహత్తా ప్యాలెస్‌ కూడా ఉంది.

డాక్టర్ ఆరిఫ్ రాజకీయ ప్రస్థానం ఐదు దశాబ్దాల క్రితమే ప్రారంభం అయ్యింది. లాహోర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ పంజాబ్‌లో ఆయన విద్యార్థినేతగా ఎదిగారు. మిలటరీ పాలకుడు ఆయుబ్ ఖాన్‌ను ఎదిరించినవారిలో డాక్టర్ ఆరిఫ్ ఒకరు. లాహోర్‌లోని మాల్ రోడ్డులో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆరిఫ్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఇప్పటికీ ఆ బుల్లెట్‌ తన కుడి చేతిలో ఉంది. నాటి ప్రజాస్వామ్యం కోసం పోరాడిన గుర్తుగా బుల్లెట్‌ను తన శరీరంలో అలానే ఉంచేసుకున్నారు డాక్టర్ ఆరిఫ్.

English summary
Pakistan's newly-elected President Dr Arif Alvi shares an interesting connection with India as his father was a dentist to India's first prime minister Jawaharlal Nehru, according to the ruling Pakistan Tehreek-e-Insaf (PTI) party.Alvi, 69, a close ally of Prime Minister Imran Khan and one of the founding members of the PTI, was elected as the new President of Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X