పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335..

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఆ దేశాల్నే కాకుండా ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఉద్ధృతం చేసింది. అంతేకాక మరో సంచలన నిర్ణయం కూడా ఇరాన్ తీసుకుంది. ఇరాన్ తన బ్రహ్మాస్త్రం అయిన హార్మూజ్ జల సంధిని మూసి వేసింది. దాంతో చమురు రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ధరలను ఏకంగా 20 శాతం పెంచింది. దాంతో ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 321 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 335 గా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. ఇంధన ధరలు చూసి గుండెలు బాదుకుంటున్నారు.

ఇదే విషయంపై పాకిస్థాన్ పెట్రోల్ మంత్రి అలీ పెర్వెయిజ్ మాలిక్ స్పందిస్తూ.. దేశ ప్రజలకు టెలివిజన్ మెసేజ్ పంపించారు. ఈ ధరలను స్వాగతించాల్సిన పరిస్థితి నెలకుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న లీటర్ పెట్రోల్ ధరకు రూ. 55 పెంచింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17 కు చేరింది. అలాగే లీటరు డీజిల్ ధర రూ. 335.86 కు చేరింది.

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న కారణంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావం పేద, మధ్యతరగతి ప్రజలపై పడుతుందని చెబుతున్నారు. అలాగే ఇంధన ధరలు దేశవ్యాప్తంగా వాణిజ్య ధరలు, నిత్యావసరాలపై పడే ప్రమాదం ఉన్నట్లు వివరిస్తున్నారు. పెట్రోల్ ధరల పెంపునకు ముందే పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీలోని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు భారీగా క్యూ కట్టారు.

Pakistan Petrol Price Hike Rs 321 Litre Amid Iran-Israel-US War Tensions and Diesel Hits Rs 335

ఇక పెట్రోల్ అంశంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు దర్శనమివ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి బోర్డులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ వద్ద తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నట్లు తెలిపారు. అయితే మిడిల్ ఈస్ట్ లో సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి నిల్వల్ని మరిన్ని రోజులపాటు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక పాకిస్థాన్ అత్యధికంగా సౌదీ అరేబియా, దుబాయ్ నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. పాకిస్థాన్ కు చమురు హార్మూజ్ జలసంధి నుంచే వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+