ప్రధాని పదవికి నవాజ్‌షరీఫ్ రాజీనామా, రేసులో వీరే
పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేశారు.పనామా కేసులో ఆయనను అనర్హుడిగా ప్రకటించింది సుప్రీంకోర్టు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఇస్లామాబాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేశారు.పనామా కేసులో ఆయనను అనర్హుడిగా ప్రకటించింది సుప్రీంకోర్టు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.రక్షణమంత్రి ఆసిఫ్ , నవాజ్ షరీఫ్ సోదరుడు ప్రధానమంత్రి రేసులో ఉన్నారు.
పనామా కేసులో నవాజ్‌షరీప్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులను కూడ కోర్టు తప్పుబట్టింది.అయితే ఈ విషయమై కోర్టు వెంటనే ఆయనను పదవి నుండి తప్పుకోవాలని కోరింది.

కోర్టు ఆదేశాల మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో నిజాయితీ గల సభ్యుడిగా కొనసాగేందుకు ఆయనకు అర్హత లేదని కోర్టు అభిప్రాయపడింది.
అయితే కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకొనేందుకుగాను అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో షరీఫ్ సోదరుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహ్‌బజ్ షరీఫ్ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ కూడ ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications