భారత్ పై పాకిస్తాన్ ప్రధాని తీవ్ర ఆరోపణలు
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జిల్లా సెషన్స్ కోర్టు భవనం ఆవరణలో ఈ మధ్యాహ్నం చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో ఇస్లామాబాద్‌లో పలు అంతర్జాతీయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇంటర్-పార్లమెంటరీ స్పీకర్స్ కాన్ఫరెన్స్, మర్గల్లా డైలాగ్ వంటివి ఇందులో ఉన్నాయి. రావల్పిండిలో శ్రీలంక- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా జరుగుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది.
ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ ఘటనకు భారత్ కారణమని ఆరోపించారు. సోమవారం వానాలోని క్యాడెట్ కళాశాలపై జరిగిన దాడిలో కూడా భారత్ పాత్ర ఉందని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వ భారత్ కు ప్రాక్సీగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్, వానాల్లో చోటు చేసుకున్న ఈ ఈ రెండు దాడులకు కూడా భారత్- దాని అనుబంధ ఉగ్రవాద ప్రాక్సీలు కారణమని షరీఫ్ అన్నారు.

ఈ దాడులతో పాకిస్తాన్ ను భయపెట్టలేరని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని ఎవరూ అస్థిరపరచలేరని చెప్పారు. ఇక్కడి ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురి చేయడం, అస్థిర పరచడానికి భారత్ సాగిస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించబోవని అన్నారు. భారత్- ఆ దేశం స్పాన్సర్ చేస్తోన్న ఉగ్రవాదానికి ఇస్లామాబాద్, వానా దాడులు కొనసాగింపుగా భావిస్తోన్నామని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఈ దాడులను ఎంత ఖండించినా తక్కువేనని చెప్పారు.
భారత్ మద్దతు ఇస్తోన్న మిలిటెంట్లు ఇస్లామాబాద్‌పై దాడి చేశారని, ఆఫ్ఘన్ భూభాగం నుండి పనిచేస్తున్న అదే నెట్‌వర్క్ వానాలో అమాయక పిల్లల ప్రాణాలు తీశారని అన్నారు. తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి భారత్.. ఆఫ్ఘనిస్తాన్ తో కలిసి పని చేస్తోందని షరీఫ్ ఆరోపించారు. వారి ఉద్దేశాలు ఇక్కడ కార్యరూపం దాల్చబోవని, వీటిని అడ్డుకుంటామని అన్నారు.
కాగా- ఈ ఆత్మాహుతి దాడికి పాకిస్తానీ తాలిబన్ (టీటీపీ) బాధ్యత వహించింది. రాజధానిలో ఇలాంటి దాడి జరగడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. పాకిస్తాన్ కు చెందిన నాన్ ఇస్లామిక్ చట్టాల ప్రకారం తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులను ఉద్దేశించి ఈ దాడులు చేశామని టీటీపీ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ముస్లిం మెజారిటీ దేశంలో ఇస్లామిక్ చట్టాలు అమలు అయ్యే వరకు దాడులు జరుగుతాయని కూడా హెచ్చరించింది.
-
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..!












Click it and Unblock the Notifications