Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అర్థింపు

Pakistan PM Shahbaz Sharif: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల నరమేధానికి భారత్.. ప్రతీకారం తీర్చుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. సైనిక చర్యతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాక్ దురాగతాలను భారత్ బట్టబయలు చేస్తోన్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.

భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, ఉగ్రవాదం సహా అన్ని అంశాలనూ చర్చల ద్వారా, శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంవత్సరాల తరబడి కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సుముఖతను తెలియజేసింది.

Pakistan PM Shehbaz Sharif urged Donald Trump to mediate with India

ఈ విషయాన్ని స్వయానా ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్లు, వాణిజ్యం, ఇండస్ వాటర్ ట్రీటీ.. వంటి ఇతరత్రా అంశాలపై భారత్ తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తోన్నామని, చర్చల ద్వారానే అది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు.

ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో షరీఫ్ పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపారని ప్రశంసించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకరించారని పేర్కొన్నారు.

అలాగే.. భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు ఏర్పాటు కావడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ సహకరించాలని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే నివారించానని, కాల్పుల విరమణ కుదిర్చానని ఇప్పటివరకు 10 వేర్వేరు వేదికల ద్వారా ట్రంప్ ప్రకటించుకున్నారని గుర్తు చేశారు.

పాక్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్ మరో అడుగు ముందుకేసి, భారత్ తో సమగ్రంగా శాంతి చర్చలు ఏర్పాటు కావడానికి సహకరించాలని షరీఫ్ కోరారు. దీనిపై త్వరలోనే వైట్ హౌస్ ఓ సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

గతంలోనూ శాంతి చర్చల ప్రతిపాదనను తెర మీదికి తీసుకొచ్చారు షెహబాజ్ షరీఫ్. ఇరాన్ పర్యటన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. భారత్ నిజంగా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటోన్నట్లయితే తమ ప్రతిపాదనలకు అంగీకరించాలని వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, భారత్ వైఖరి ఏమిటనేది ఆ దేశ నాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

సుదీర్ఘకాలంగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోన్న జమ్మూ కాశ్మీర్ సహా అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అప్పట్లో వెల్లడించారాయన. తమ దేశంపై భారత్ దురాక్రమణకు పాల్పడాలను చూస్తే తమ భూ భాగాన్ని రక్షించుకోవడానికి తాము కూడా అదే మార్గంలో వెళ్తామని, ధీటుగా సమాధానం ఇస్తామని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+