ఇమ్రాన్ కంట్రోల్లోనే పాక్ పాలిటిక్స్- ఆపద్ధర్మ ప్రధానిగా మాజీ సీజే గుల్జార్- యూఎస్ మద్దతు

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మొదలుకుని ఇప్పటివరకూ జరుగుతున్న వరుస పరిణామాలు ఇంకా ఆయన నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ను గద్దెదింపేందుకు విపక్షాలు అన్నీ ఏకమై ఆయన మిత్రపక్షాల సాయం కూడా తీసుకుని ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించగా.. జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయానికి అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఇమ్రాన్ కోరినట్లుగానే ఆపద్ధర్మ ప్రధానిగా మాజీ సీజే గుల్జార్ ను నియమించారు. దీంతో దిక్కుతోచని స్దితిలో పడిన విపక్షాలు ఇక సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నాయి.

ఇమ్రాన్ పాలిటిక్స్

ఇమ్రాన్ పాలిటిక్స్

పాకిస్తాన్ లో క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఊహించిన దాని కంటే అనూహ్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ విపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. అవిశ్వాస తీర్మానంతో తనను గద్దె దించాలని భావించిన విపక్షాలకు రాజీనామా చేయకుండా చివరి నిమిషం వరకూ వేచి చూసేలా చేసిన ఇమ్రాన్.. చివర్లో డిప్యూటీ స్పీకర్ సాయంతో అవిశ్వాస తీర్మానం తిప్పికొట్టేలా చేశారు. చివరికి జాతీయ అసెంబ్లీ రద్దు చేయడమే కాకుండా అధ్యక్షుడి సాయంతో దానికి ఆమోదముద్ర కూడా వేయించుకున్నారు. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధాని ఎంపికలోనూ తనదైన మార్క్ చూపించారు. ఇక విపక్షాలకు మిగిలింది సుప్రీంకోర్టు తీర్పు ఒక్కటే.

 సుప్రీం నిర్ణయమే కీలకం

సుప్రీం నిర్ణయమే కీలకం

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, ఆ తర్వాత ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పైవిచారణ కొనసాగుతోంది. దీనిపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ సుప్రీంకోర్టు నిర్ణయంపైనే ఉన్నాయి. ఒక వేళ సుప్రీంకోర్టు.. డిప్యూటీ స్పీకర్, అధ్యక్షుడి నిర్ణయాలు చెల్లవని ప్రకటిస్తే మాత్రం ఇమ్రాన్ చిక్కుల్లో పడటం ఖాయం. అలా జరగకుండా సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్ నిర్ణయాలకు మద్దతిస్తే మాత్రం విపక్షాలకు భారీ ఝలక్ తప్పదు. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు చెప్పే తీర్పు కోసం విపక్షాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

వేగంగా పరిణామాలు

వేగంగా పరిణామాలు


పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ సూచించిన మాజీ సీజే గుల్జార్ అహ్మద్ ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఇమ్రాన్ స్దానంలో గుల్జార్ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్‌ను తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి ఇమ్రాన్ ఖాన్ నామినేట్ చేశారు.పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 224-A(1) ప్రకారం, దేశంలో ఎన్నికలను నిర్వహించడానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలిక ప్రధానిని నియమించే వరకు ఖాన్ ప్రధానిగా కొనసాగుతారు. మరోవైపు ఈ సంక్షోభం నేపథ్యంలోనే జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా ఇమ్రాన్ తప్పుకోవడం ఖాయం కావడంతో ఆయన రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది. తన నిర్ణయం గర్వంగా ఉందని ఆయన ట్వీట్ కూడా చేశారు. అటు రాజకీయ గందరగోళంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో రాజ్యాంగ, ప్రజాస్వామ్య విధానాలను శాంతియుతంగా సమర్థించేందుకు ఆ దేశం మద్దతిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందన్న వాదనలను ప్రైస్ తోసిపుచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+