కాశ్మీర్ మాదే: పాక్ ప్రధాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
కాశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాశ్మీర్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగం అవుతుందని కీలక ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 5 కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) ను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనదని తెలిపారు. అంతేకాక కాశ్మీర్ వివాదం నెపంతో భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
ఫిబ్రవరి 5.. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్బంగా పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకునే అవకాశం లేదన్నారు. కాశ్మీర్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగం అవుతుందంటూ కీలక కామెంట్స్ చేశారు.
ఈ వివాదాన్ని భారత్ పరిష్కరించని పక్షంలో ప్రాంతీయ అస్థిరత కొనసాగుతుందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అంతేకాక.. కాశ్మీర్ ను పాకిస్థాన్ జీవనాడిగా జిన్నా ప్రకటించారని.. అది ఇప్పటికీ మా విదేశాంగ విధానానికి ఆధారంగా ఉందని షరీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం చేతిలో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ, సయ్యద్ అలీ గిలానీల పేర్లను పాక్ ప్రధాని ప్రస్తావించారు.

మరోవైపు పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. కాశ్మీరీలకు తమ దేశ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. భారత సైన్యం చేస్తున్న అణచివేత కాశ్మీరీల సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది.. అని పేర్కొన్నారు. కాశ్మీర్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం మౌనం వీడాలని, భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications