షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ కు నోబెల్ శాంతి బహుమతా..? ఏం పొడిచారని..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచ దేశాలతో పాటుగా పాకిస్థాన్ లో కూడా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. హార్మూజ్ జలసంధి మూసివేతతో పాకిస్థాన్ సహా అనేక దేశాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. అయితే పాకిస్థాన్ లో ఇరాన్- అమెరికా శాంతి చర్చలు అన్నప్పుడు పాకిస్థాన్ పరువు పోయింది. అందరూ అనుకున్నట్లుగానే చర్చలు విఫలం అయ్యాయి.
ఇరాన్- అమెరికా బృందాల మధ్య దాదాపు 21 గంటలపాటు జరిగిన శాంతి చర్చలు విఫలం అయినట్టు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. అయితే మరోసారి అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్ తన పరువును తీసుకుని నవ్వులపాలైంది. ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని.. ఇరాన్- అమెరికా మధ్య చర్చలు విజయవంతం కాకుండానే ఆ దేశం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటోంది. ఈ మేరకు ఏకంగా తమకు నోబెల్ బహుమతి కావాలని ప్రకటించుకుంటోంది.
తాజాగా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని పెట్టింది. దానికి ఆమోద యోగ్యం లభించింది. ఇక ఈ తీర్మానంలో భాగంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ లు తోపులు.. తురుములు అని ప్రకటించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ దౌత్య చర్చలు నడిపించిన ఈ నాయకుల చెక్కు చెదరని నాయకత్వం, అసాధారణ దార్శనికత అంటూ , అలుపెరగని కృషి అంటూ నోటికొచ్చినట్లు అభినందించుకున్నారు. దాంతో మరోసారి పాకిస్థాన్ అంతర్జాతీయ మీడియా ముందు నవ్వులపాలైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఇరాన్- ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలు పాక్ రాజధాని ఇస్లామాబాద్ లేదా స్విట్జర్లాండ్ లో జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications